విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేజీహెచ్ ఆస్పత్రి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇక పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు.
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సింహాచలంలో గోడ కూలి క్యూలైన్లో ఉన్న భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.
సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ లో ఫిన్ టెక్ ప్రగతి ప్రయాణం భూముల చుట్టూ తిరుగుతోంది. విశాఖలో అత్యంత ఖరీదైన భూములను 99పైసల లీజుకు కేటాయించడం తీవ్ర చర్చ నీయాంశంగా మారుతోంది. ఐటీ అభివృద్ధి, ఏకో సిస్టమ్ కోసం ప్రభుత్వం సంకల్పంకు ఈ నిర్ణయం ఉదాహరణగా అధికారపార్టీ సమర్ధించుకుంటుంటే.. భూ పందేరాల వెనుక రహస్య అజెండా ఉందని ప్రతిపక్షం అనుమానం వ్యక్తం చేస్తోంది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే చంద్రమౌళి కుటుంబ సభ్యులు పహల్గాం…
మేయర్ ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ పార్టీ బీ ఫాంపై గెలిచి కూటమికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.. వైసీపీ సభ్యులకు విప్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను ఎన్నికల అధికారికి అందజేశారు ఆ పార్టీ నేతలు తైనాల విజయ్ కుమార్, పల్లా దుర్గా రావు.
రాష్ట్రంలో వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. మేజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి…
కొద్దిగంటలు మాత్రమే సమయం...! నెలరోజుల ఉత్కంఠకు తెరపడుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై అధిపత్యం ఎవరిదో తేలిపోతుంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి.