Uttar Pradesh: దొంగలు తెలివిమీరారు. ఐదో తరగతి చదువుకుని, ఆటో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే వ్యక్తి కార్ల దొంగతనాల కోసం పెద్ద ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. లగ్జరీ కార్లను దొంగతనం చేసేందుకు యూట్యూబ్, సాఫ్ట్వేర్ సాయంతో 500కి పైగా కార్లను దొంగతనం చేశారు. నిరక్షరాస్యులైనప్పటికీ.. యూట్యూబ్లో కార్ల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని అమలు చేశారు. తాజ్ మహ్మద్ అనే వ్యక్తి తొలిసారిగా రౌనక్ అలీ అలియాస్ బాబుతో పరిచయం పెంచుకున్నాడు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన వారణాసి పర్యటనలో పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వారణాసి ప్రజలు ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ఉత్తర ప్రదేశ్ ప్రజల్ని అవమానించినందుకు ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్నవారిని తాను చూశానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ శుక్రవారం మండిపడ్డారు.
ఇండియా కూటమికి ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ తర్వాత లోక్సభ స్థానాల పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు మాకంటే మాకు అన్నట్లుగా వ్యవహరించాయి. దీంతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు…
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) సవాలు విసిరారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయాలని స్మృతి ఇరానీ సవాలు చేశారు.
భారత్లో జరుగుతున్న అభివృద్ధి గురించి విదేశాల్లో చర్చించుకుంటున్నారని ప్రధాని మోడీ (PM Modi) తెలిపారు. ఉత్తర ప్రదేశ్లోని (Uttar Pradesh) లక్నోలో (Lucknow) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.
Amethi: 2024 లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అమేథీ వేదికగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒకే రోజు పలు కార్యక్రమాలుకు హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఈ రోజు అమేథీ పట్టణంలోని ప్రవేశిస్తోంది. కొన్ని దశాబ్ధాలుగా గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీని బీజేపీ బరిలో నిలిపి గెలిపించింది. అయితే, ఈ ఇద్దరు నేతలు కూడా ఒకేసారి అమేథికి రావడం…
Kalki Dham Temple: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలో కల్కిధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం ప్రధానిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆలయ శంకుస్థాపన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. యూపీ అంతటా రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
Instagram reel: ఇటీవల కాలంలో యువతకు రీల్స్ పిచ్చి పీక్స్కి చేరుకుంది. కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా కొందరికి తెలియడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లో ఓ యువకుడు పోలీస్ జీపుతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి చిక్కుల్లో పడ్డారు. అతను చేసిన రీల్ వైరల్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది.