అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించేందుకు సీమా హైదర్ పాదయాత్ర చేసేందుకు రెడీ ఉన్నట్లు ప్రకటించింది. ఇందు కోసం ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంది.
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ రాయ్ బరేలీ ఎంపీ బరిలో నిలవడం లేదు. తాజాగా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీలో ప్రత్యేక అనుబంధం ఉంది. కాంగ్రెస్‌లో ఈ పరిణామంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తోందని బీజేపీ బుధవారం పేర్కొంది. సోనియా గాంధీ జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత బిజెపి ప్రతిస్పందన…
Aphrodisiac Pills: కొత్తగా పెళ్లిన మహిళపై భర్త రాక్షసుడిగా ప్రవర్తించాడు. శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలు వేసుకుని ఫస్ట్ నైట్ రోజు సెక్స్ చేశాడు. దీంతో నవవధువు తీవ్ర గాయాలతో మరణించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హమీద్పూర్లో చోటు చేసుకుంది. మొదటి రాత్రి రోజు సెక్స్ స్టామినాను పెంచే మాత్రలను తీసుకుని, సెక్స్ చేయడంతో మహిళ మరణించింది. తీవ్రగాయాలైన మహిళను కాన్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై 40 మందితో ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు.
Agra: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన తల్లిని, కొడుకును హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య గుడికి వెళ్లిన సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్య, హత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
Valentine Day: వాలెంటైన్ డేని ప్రేమికులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంత్రి సేన మాత్రం ‘లాఠీ పూజ’ని నిర్వహించింది. లాఠీలకు నూనె రాసి పూజ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేమికులు దినోత్సవం ముసుగులో అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తించే, ఆటపట్టించే వ్యక్తులకు, లవ్ జిహాద్ వ్యాప్తి చేసే వ్యక్తులకు లాఠీలతో గుణపాఠం చెబుతామని క్రాంతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ సైనీ శనివారం వార్నింగ్ ఇచ్చారు.
Gyanvapi: ఉత్తర్ ప్రదేశ్ బరేలీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇత్తేహాద్-ఈ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్ జ్ఞానవాపి వివాదంలో ‘జైల్ భరో’కి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జ్ఞానవాపి కేసులో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా, బారికెడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు.
INDIA bloc: ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీని అధికారం నుంచి దించేందుకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ పలు పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే, ఇండియా కూటమి రూపశిల్పిగా పేరున్న సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీతో పొత్తును కాదని, ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టారు. ఇక టీఎంసీ చీఫ్,…