దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకోబోతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జోస్యం చెప్పారు.
Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసు విచారణలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా హాజరుకావాలని సమన్లలో కోరారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ని రేపు దర్యాప్తు సంస్థ ప్రశ్నించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అఖిలేష్ 2012 నుంచి జూన్, 2013 మధ్య మైనింగ్ శాఖను నిర్వహించాడు.
Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదని ‘పరారీ’ ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ప్రకటించింది. ఆమెపై ఉన్న రెండు కేసుల విచారణలో హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఆమె బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థిగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించినట్లు కేసులు నమోదయ్యాయి.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఏడుగురు సమాజ్‌వాదీ(ఎస్పీ) ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాల్లో 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఓటమి అంచున…
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారీ తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి అందిన లెక్కల ప్రకారం.. మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో 21.5 కోట్ల మంది వ్యక్తులు కేవలం 29 ఏళ్లలోపు వారు మాత్రమే ఉన్నారు.
Gaming addict: ఆన్లైన్ గేమింగ్స్‌కి యువత బానిసగా మారుతోంది. ఈ వ్యసనం కారణంగా అప్పుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సొంత తల్లినే కడతేర్చాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం.. తల్లిదండ్రుల పేరిటి ఇన్సూరెన్స్ చేయించి, వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. వరసగా ఢిల్లీ వేదికగా సమావేశాలు నిర్వహిస్తోంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఈ సారి బీజేపీ సొంతగా 375 సీట్లను గెలుచుకోవాలని, ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పరీక్షను రద్దు చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆరు నెలల్లో తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సీఎం తెలిపారు. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల పవిత్రతలో రాజీపడే ప్రసక్తే లేదు.. యువత కష్టార్జితంతో ఆడుకున్న వారిని వదిలిపెట్టబోం. ఇలాంటి వికృత…
ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఎటాహ్‌లోని కసా పూర్వి గ్రామం నుంచి గంగాస్నానానికి వెళ్తున్న గ్రామస్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై ఉన్న చెరువులో అదుపు తప్పి పడిపోయింది.