Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు.. రాహుల్ యాత్రపై క్లారిటీ ఇచ్చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు అయోమయం.. గందరగోళం నెలకొంది. ఓ వైపు సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తున్నాయని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) చెబుతూనే.. ఇంకోవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా 36 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంకోవైపు కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇస్తామంటూ రాయబారాలు నడుపుతోంది. మొత్తానికి రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ మాత్రం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే యూపీలోనే రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు అఖిలేష్ మాత్రం పాల్గొనలేదు. తాజాగా ఈ అంశంపై అఖిలేష్ స్పందించారు.
యూపీలో కాంగ్రెస్‌తో (Congress) తమ పొత్తు కొనసాగుతుందని.. రాహుల్ గాంధీతో (Rahul Gandhi) తమకు ఎలాంటి వివాదం లేదని బుధవారం అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సంబంధాలు తెగిపోతోందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
రాహుల్‌తో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని.. ఎలాంటి వివాదం లేదని అఖిలేష్ తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ మధ్య పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 17-19 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే దీనిపై ఇరు పార్టీలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.
మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు 17–19 సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్రాస్‌కు బదులుగా సీతాపూర్ సీటును కాంగ్రెస్‌కు కేటాయించినట్లు సమాచారం. ఇక 2019 ఎన్నికల్లో యూపీలో రాయ్‌బరేలీ సీటు ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. అది కూడా సోనియా గాంధీ మాత్రం విజయం సాధించారు. అమేథీలో పోటీ చేసిన రాహుల్ మాత్రం ఓడిపోయారు. ఈసారి రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
#WATCH | Moradabad, UP: On asking why he was not present twice for the Bharat Jodo Nyay Yatra, Samajwadi Party Chief Akhilesh Yadav says, "All is well that ends well… Yes, there will be an alliance. There is no conflict. Everything will be out and clear soon… All is well that… pic.twitter.com/fOmkbYUm9B
— ANI (@ANI) February 21, 2024
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?