Uttar Pradesh: అంతా నిరక్షరాస్యులు.. యూట్యూబ్, సాఫ్ట్‌వేర్ ఉపయోగించి 500కి పైగా కార్‌ల దొంగతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: దొంగలు తెలివిమీరారు. ఐదో తరగతి చదువుకుని, ఆటో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే వ్యక్తి కార్ల దొంగతనాల కోసం పెద్ద ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. లగ్జరీ కార్లను దొంగతనం చేసేందుకు యూట్యూబ్, సాఫ్ట్‌వేర్ సాయంతో 500కి పైగా కార్లను దొంగతనం చేశారు. నిరక్షరాస్యులైనప్పటికీ.. యూట్యూబ్‌లో కార్ల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని అమలు చేశారు. తాజ్ మహ్మద్ అనే వ్యక్తి తొలిసారిగా రౌనక్ అలీ అలియాస్ బాబుతో పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరు రింకూ, హకీమ్ అనే మరో ఇద్దరిని కలుసుకుని ఒక ముఠాగా ఏర్పడి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కార్లను దొంగతనం చేయడం ప్రారంభించారు. చాలా సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత తాజ్ గుడ్డు, కాషిఫ్, మతీన్‌తో ముఠాను విస్తరించాడు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ పోలీసులు ముస్సోరిలో ఈ ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. వీరికి దుబాయ్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది.
కార్లను అన్‌లాక్ చేయడానికి హైటెక్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించారు. దొంగలించిన కార్లను వీరు సంభాల్‌లోని అమీర్ అనే వ్యక్తికి సరఫరా చేసేవారు. అతను కార్లను వడోదరలోని వ్యక్తికి పంపిణీ చేసేవాడు. యాంటీ థెఫ్ట్ వ్యవస్థ ఉన్న కార్లను దొంగిలించేందుకు టాబ్లెట్లలో సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమీర్, అతని భార్య కూడా దొంగతనంలో భాగస్వామిగా తేలింది. కార్ల దొంగతనానికి సంబంధించిన టూల్స్, రిమోట్ కాంట్రోల్డ్ కార్ కీలను సరఫరా చేసినట్లు ఏసీపీ అజిత్ కుమార్ చెప్పారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్‌లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
Read Also: Rahul Gandhi: ‘40% కమిషన్’పై రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు కోర్టు సమన్లు..
కార్లకు డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే తాము దొంగతనం చేస్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. గడ్డూ, మతీన్, కాషిఫ్ కారును గుర్తించేందుకు రెక్కీ నిర్వహించేవారని, కారులోకి ప్రవేశించేందుకు కారు విండోను పగలగొట్టేవారని, టాబ్లెట్‌లో డౌన్‌లోడ్ చేసిని సాఫ్ట్‌వేర్ సాయంతో డూప్లికేట్ కీని తయారు చేసేవారని పోలీసులు తెలిపారు. స్టీరింగ్ లాక్ బ్రేక్ చేసేందుకు మాగ్నెట్స్ వాడేవారన్నారు. జీపీఎస్ ట్రాకర్లను తొలగించేందుకు మాగ్నెట్లను వాడారు. కార్ టెక్నాలజీ మారితే, వీరు దొంగిలించే పద్ధతుల్ని కూడా మార్చేవారు.
దొంగలు తమ ఫోన్లను ఫ్లైట్ టైమ్‌లో ఉంచి, ట్రాక్ చేయబడటం లేదని నిర్ధారించుకునేందుకు లొకేషన్ డిసెబుల్ చేసేవారు. నేరం చేస్తున్న సమయంలో నార్మల్ కాల్స్ ఉపయోగించకుండా వాట్సాప్ కాల్స్ ఉపయోగించే వారమని దొంగలు చెప్పారు. ఇలా నేరం చేయడం ద్వారా వచ్చిన డబ్బుని సమానంగా పంచుకునే వారని పోలీసులు వెల్లడించారు.
అమీర్‌కి దుబాయ్‌తో లింకులు ఉన్నట్లు తేలింది. కార్ డూప్లికేట్ కీలను రూపొందించడానికి తరుచూ దుబాయ్ వెళ్తున్నట్లు తేలింది. దొంగల నుంచి రెండు మారుతీ విటారా బ్రెజ్జా, ఒక బొలెనో, హోండా జాజ్, హ్యుందాయ్ శాంట్రోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్క్రూడ్రైవర్లు, సుత్తిలు, టాబ్లెట్లు తేలింది. నిందితులు ఢిల్లీలోని రోహిణిలోని ఏటీఎంలో కూడా డబ్బు దొంగిలించినట్లు తేలింది.
తాజావార్తలు
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!