ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పరీక్షను రద్దు చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆరు నెలల్లో తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సీఎం తెలిపారు. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల పవిత్రతలో రాజీపడే ప్రసక్తే లేదు.. యువత కష్టార్జితంతో ఆడుకున్న వారిని వదిలిపెట్టబోం. ఇలాంటి వికృత శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
Viral Video: ఢిల్లీ మెట్రోలో మరోసారి రెచ్చిపోయిన యువతులు.. చూసేవారికి భలే టైమ్ పాస్
కాగా.. ఈ నెల 17, 18 తేదీల్లో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మొత్తం 48 లక్షల మంది అభ్యర్థులు 60 వేల పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్షకు హాజరయ్యారు. రోజుకు రెండు షిఫ్టుల్లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ అయ్యినట్లు ఆరోపణలు వచ్చాయి. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా నిషేధం విధించారు. బ్లూటూత్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అంతరాయం కలిగించడానికి వారు జామర్‌లను కూడా అమర్చారు. అయినప్పటికీ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
Haldwani violence: హల్ద్వానీ అల్లర్ల సూత్రధారి అబ్దుల్ మాలిక్ అరెస్ట్..
మరోవైపు.. పేపర్ లీక్ ఆరోపణలపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు చోట్ల నిరసనలు తెలుపుతున్నారు. కాగా.. సీఎం ప్రకటనతో అభ్యర్థులు పరీక్ష రద్దు నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
.@Uppolice आरक्षी नागरिक पुलिस के पदों पर चयन के लिए आयोजित परीक्षा-2023 को निरस्त करने तथा आगामी 06 माह के भीतर ही पुन: परीक्षा कराने के आदेश दिए हैं।
परीक्षाओं की शुचिता से कोई समझौता नहीं किया जा सकता।
युवाओं की मेहनत के साथ खिलवाड़ करने वाले किसी भी दशा में बख्शे नहीं…
— Yogi Adityanath (@myogiadityanath) February 24, 2024