Allahabad High Court: పాఠశాలలో మందుబాబులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఓ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి వల్ల తమ చదువులు దెబ్బతింటున్నాయని ఆరోపించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఇక, కాన్పూర్‌లోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి అథర్వ తన కుటుంబ సభ్యుల సహాయంతో యూపీ హైకోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశాడు.
Read Also: RC 16: రామ్ చరణ్,బుచ్చిబాబు చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..
ఇక, దీనిపై విచారించిన హైకోర్టు ప్రతి సంవత్సరం ఈ మద్యం దుకాణం కాంట్రాక్టును ఎలా పునరుద్ధరిస్తున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ స్కూల్ కాన్పూర్ నగరంలోని ఆజాద్ నగర్ ఏరియాలో ఉంది. అక్కడికి 20 మీటర్ల దూరంలో లిక్కర్ షాప్ ఉంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాతే ఓపెన్ చేయాలి.. కానీ, ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని అథర్వ న్యాయస్థానంలో పేర్కొన్నాడు.
Read Also: CM Revanth Reddy: 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలు?
ఇక, అథర్వ కుటుంబ సభ్యులు ఈ విషయంపై కాన్పూర్ పోలీసులకు, యూపీ సర్కార్ కు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోలేదని వెల్లడించారు. కాగా ఈ పాఠశాల 2019లో ప్రారంభమయ్యింది.. మద్యం దుకాణానికి సంబంధించిన ఒప్పందం దాదాపు 30 ఏళ్ల నాటిదని వైన్స్ దుకాణ యజమాని గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో అథర్వ తన కుటుంబ సభ్యుల సహకారంతో అలహాబాద్ హైకోర్టులో పిటిసన్ వేశాడు. ఈ కేసును జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ క్షితిజ్ శైలేంద్రలతో కూడిన ధర్మాసానం విచారిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది అని పేర్కొనింది.