ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని సిక్రారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధాపూర్ గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. హమీర్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగిన తర్వాత ఇద్దరు బాధితురాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బాధితురాళ్లలో ఒకరి తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాన్పూర్‌లోని ఘతంపూర్ ప్రాంతంలో ఇసుక బట్టీలో సాహూహిక అత్యాచారానికి గురైన వ్యక్తి కూతురు, మేనకోడలు కూడా ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాత 45 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలికలకు బలవంతంగా…
సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada) ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువతి నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న పథకం యొక్క ప్రయోజనాలు పొందేందుకు ఏకంగా భర్తనే మార్చేసింది. తనను పెళ్లి చేసుకోవాల్సిన వరుడు రాకపోవడంతో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం ప్రయోజనాలను పొందేందుకు సదరు మహిళ తన బంధువుల అబ్బాయితో వివాహ లాంఛనాలను పూర్తి చేసింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ ప్రారంభించారు. ఝాన్సీలో మంగళవారం 132 జంటలకు జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకోబోతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జోస్యం చెప్పారు.
Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసు విచారణలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా హాజరుకావాలని సమన్లలో కోరారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ని రేపు దర్యాప్తు సంస్థ ప్రశ్నించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అఖిలేష్ 2012 నుంచి జూన్, 2013 మధ్య మైనింగ్ శాఖను నిర్వహించాడు.
Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదని ‘పరారీ’ ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ప్రకటించింది. ఆమెపై ఉన్న రెండు కేసుల విచారణలో హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఆమె బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థిగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించినట్లు కేసులు నమోదయ్యాయి.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఏడుగురు సమాజ్‌వాదీ(ఎస్పీ) ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాల్లో 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఓటమి అంచున…
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారీ తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి అందిన లెక్కల ప్రకారం.. మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో 21.5 కోట్ల మంది వ్యక్తులు కేవలం 29 ఏళ్లలోపు వారు మాత్రమే ఉన్నారు.