Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణం జరిగింది. ప్రియురాలిని హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాకోరికి చెందిన బ్రిజేష్ మౌర్యను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతని ప్రియురాలు సరిత, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినందుకే నిందితుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువు వద్ద వేలాడదీశాడు.
‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అని ఓ కవి సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలను చూసి చలించిపోయి రాసిన పాట ఇది. అచ్చం అలాగే జరుగుతున్నాయి నేరాలు-ఘోరాలు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో గల విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత, అర్ధరాత్రి జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు ప్రారంభమయ్యాయి.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.. కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన శకటం పలువురిని ఆకట్టుకుందని తెలిపింది.
Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవాన్ని చూశారు. ఇదిలా ఉంటే ప్రాణప్రతిష్ట తర్వాత రోజు జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో రామ్ జానకీ ఆదలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆలయాన్ని పేల్చేస్తామని బెదిరిస్తూ ఆలయ గోడలకు, ఆలయంలో పోస్టర్లు వెలిశాయి. ఆలయ ధర్మకర్త బీజేపీ నేత రోహిత్ సాహూకు కూడా ఈ బెదిరింపు లేఖలు వచ్చాయి. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన ఆరు రోజుల తర్వాత ఈ లేఖలు రావడం చర్చనీయాంశంగా మారాయి.
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిందని దారుణానికి పాల్పడ్డాడు. తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి అమ్మని, సోదరుడిని కాల్చి చంపినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిందితుడిని అసిహాబాద్కి చెందిన సంజీవ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా..పోలీసులు వెతుకుతున్నట్లు తెలిపారు.
Gyanvapi Case: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో మసీదుకు పూర్వం పెద్ద హిందూ దేవాలయం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) నివేదిక సూచిస్తోందని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు. మసీదు నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వసం చేసినట్లు నివేదిక సూచిస్తోందని జైన్ అన్నారు.