సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకత్వం వహిస్తుండగా డైరెక్టర్ భరత్ కమ్మ కథను అందించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సిరీస్ ట్రైలర్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కామెడీ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ని బట్టి అర్దమవవుతుంది. కథ విషయానికొస్తే..…
తక్కువ టైమ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడమే కాదు… పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తనదైన అటిట్యూడ్ తో యూత్ లో క్రేజీ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రౌడీ బ్రాండ్ తో యువత మనసు దోచిన విజయ్ సినిమా థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా వచ్చిన గుర్తింపుతో పలు ప్రకటనల్లో దర్శనం ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా…
విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న చిత్రం ‘అల్లంత దూరాన’. ఈ చిత్ర నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో మూవీ టీజర్ ను హాస్యనటుడు అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, ”కధకు తగ్గట్టుగా ఆర్టిస్టులను ఎంపిక…
కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు వేవ్స్ లోను సినిమా రంగాన్ని ఛిద్రం చేసింది.చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు కరోనా దెబ్బకు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక చాలామంది నిర్మాతలు ఈ గడ్డుకాలం నుంచి తప్పించుకోవడానికి ఓటీటీ బాట పడితే కొన్ని చిత్రాలు డేర్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. గత కొంత కాలంగా భారీ ప్రాజెక్ట్ ల రిలీజ్ డేట్లపై సందిగ్దత నెలకొన్న…
సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు రిలీజ్ డేట్ ని మార్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మరో కొత్త రిలీజ్ డేట్ తో ప్రత్యేక్షమైపోయింది. ఇటీవల రెండు రిలీజ్ డేట్లతో ముందుకొచ్చి అది లేక ఇది అని చెప్పిన మేకర్స్.. ఇప్పుడు ఆ రెండు…
మ్యాచో హీరో గోపీచంద్ ఇటీవల ‘సీటిమార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొంది కానీ గోపీచంద్ కి మాత్రం భారీ విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక దీంతో గోపీచంద్ ఆశలన్నీ తన తదుపరి సినిమా మీదనే పెట్టుకున్నాడు. హిట్ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో గోపీచంద్- రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్- యూవీ…
హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ట్యాక్సీ’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ ‘ట్యాక్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతు న్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని చెబుతున్న చిత్ర…
ప్రేమమ్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా తరువాత ‘అఆ’ చిత్రంతో తెలుగింటి ఆడపడుచుల కనిపించి తెలుగువారి హృదయాల్లో కొలువుండిపోయింది. ఇక ఇటీవల ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అమ్మడి నటనకు కుర్రకారు ఫిదా అయినా సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. ఆ ఫొటోల్లో…
ప్రముఖ మోడల్ గున్గున్ ఉపాధ్యాయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శనివారం రాత్రి ఆమె బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒక్కసారిగా జోధ్ పూర్ ఇండస్ట్రీలో కలకలం రేగింది. గున్గున్ ఉపాధ్యాయ్.. జోధ్ పూర్ కి చెందిన ఒక మోడల్.. ఇటీవలే ఆమె సినిమాల్లో కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రేణు రోజుల క్రితం ఉదయ్పూర్ వెళ్లివచ్చిన ఆమె శనివారం రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్లో బసచేసింది. ఏమైందో…