అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ నుంచి అంచెలంచెలుగా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు. వరుస హిట్లు.. టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్.. అన్ని ఇండస్ట్రీల్లోనూ బన్నీ క్రేజ్ మాములుగా ఉండదు. ఇక పుష్ప చిత్రంతో పా ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇంత స్టార్ డమ్ ఉన్నా బన్నీలో ఎక్కడా గర్వం కనిపించదు. తన పని తాను చేసుకోవడం.. తన పాత్ర కోసం కష్టపడడం.. సమయం దొరికితే ఫ్యామిలీతో గడపడుతూ ఉంటాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు ఫ్యామిలీ, బన్నీ జాతకాన్ని ఒక ప్రముఖ జ్యోతిష్కుడికి చూపించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇక ఈ జాతకంలో బన్నీకి త్వరలో కొన్ని అవాంతరాలు తప్పవట.. స్టార్ డమ్ కుడా కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయట. ఈ అవాంతరాలు తొలగాలంటే కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ పూజలను చేయడానికి కుటుంబం మొత్తం అంగీకరించిందని, త్వరలోనే అల్లు అర్జున్ ఇంట్లో పూజలు నిర్వహించాలని చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం బన్నీ పుష్ప 2 లో నటిస్తున్నాడు. మరి ఈ పూజల తరువాత బన్నీ ఇలాంటి విజయాలను ఎన్నో అందుకోవాలని, బన్నీకి ఎలాంటి ఆటంకాలు రాకూడదని ఆయన అభిమానులు కూడా దేవుడికి పూజలు చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే