సరసాలు పోయిన కలం… నవరసాలు పలికించిన కలం… నీరసాలను దూరం చేసిన కలం… ‘నవ’రసాలను ఊరించిన కలం… ఆ కలం పేరు వేటూరి సుందర రామమూర్తి! పండిత వంశంలో జన్మించిన వేటూర సుందరరాముడు చిత్రసీమలో తనదైన కవితావైభవాన్ని ప్రదర్శించారు. మహాపండితుడు, అన్నమయ్య పదకవితలను లోకానికి తెలియజేయడానికి పూనుకున్న ఘనుడు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆయన సోదరుని తనయుడే వేటూరి సుందర రామమూర్తి. వేటూరి వారింట తలుపును తట్టినా కవిత్వం పలుకుతుందని ప్రతీతి. అలాంటి వంశంలో పుట్టిన కారణంగా…
అమ్మాయి అంటే..ఇలాంటి కొలతలు ఉండాలి.. అలాంటి కలర్ ఉండాలి.. ముట్టుకుంటే మాసిపోవాలి.. పట్టుకుంటే కందిపోవాలి అని ఎంతోమంది హేళన చేస్తుంటారు. ఇక హీరోయిన్లు చాలామంది ఈ బాడీ షేమింగ్ ని ఎదుర్కొన్నవారే. అందంగా లేరని, ముక్కు వంకర, మూతి వంకర.. పొట్టిగా ఉంది, నల్లగా ఉంది అంటూ ఎవరో ఒకరు బాడీ షేమింగ్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ మాటలు ఎంత బాధ కలిగిస్తాయో పడినవారికే తెలుస్తోంది అంటున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. తాను కూడా బాడీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి అనే కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా నటించిన చిత్రం ‘బడవ రాస్కెల్’. గత యేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా కన్నడంలో చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగులో పలు సినిమాలను నిర్మించి, చక్కని గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్…
చూస్తుండగానే కొత్త సంవత్సరం మొదటి మాసం గడిచిపోతోంది. 2022కు పాన్ ఇండియా సినిమాలతో శుభారంభం జరుగుతుందని సినీజనం భావించారు కానీ వారి అంచనాలన్నీ తల్లకిందులు చేస్తూ ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ వంటి సినిమాల విడుదల వాయిదా పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే సంక్రాంతి సీజన్ పూర్తి కాగానే యాభై శాతం ఆక్యుపెన్సీ విధించారు. విడుదలైన సినిమాలకు అనుకున్న రీతిలో ఆదరణ దొరక్కపోవడం, నెలాఖరులో పెద్ద సినిమా ఒక్కటీ విడుదల కాకపోవడంతో మల్టీప్లెక్స్ లతో పాటు సింగిల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ నటనకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. జానీ సినిమా తరువాత రేణు వెండితెరపై కనిపించింది లేదు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై జడ్జ్ గా మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు వెండితెరపై కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టనున్నదట. ఇందుకోసం భారీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరో గా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరావు’ బయోపిక్ లో రేణు ఒక…
పుష్ప చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ . ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ నటనకు తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఫహద్ తో పాటు ఆయన భార్య నజ్రియా నజీమ్ కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ కనిపించనుంది.…
తెలుగు చిత్రపరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు ప్రస్తుతం నెటిజన్ల చేత విమర్శలపాలు అవుతున్నాడు. ఎందుకంటే.. ఆయన చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. తాజగా రాజమౌళి ఒక ట్వీట్ చేశాడు. అందులో దేవిక అనే మహిళ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతుందని, ఆమె పోస్ట్…
నటసింహ నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ యన్బీకే టాక్ షో వినోదాల విందుగా మారింది. ఇప్పటి దాకా తొమ్మిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది అన్ స్టాపబుల్. త్వరలోనే మహేశ్ బాబు అతిథిగా పదవ ఎపిసోడ్ ప్రసారంతో ఫస్ట్ సీజన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ వినోదాల విందులోని కొన్ని ముఖ్యఘట్టాలను ఏర్చి కూర్చి ప్రేక్షకులను ఆనందసాగరంలో ముంచెత్తడానికి ఆహా బృందం ఓ పథకం వేసింది. అందులో భాగంగా ఇప్పటి…