సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రి మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషణగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి పోస్టర్ కూడా నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. ప్రేమికుల రోజు కానుకగా విడుదల కాబోతున్న ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
ఇక థమన్ ముందుగానే చెప్పినట్లుసాంగ్ అదిరిపోయింది. సిద్ శ్రీరామ్ మెస్మరైజింగ్ వాయిస్ తో ఈ ప్రేమపాట ప్రేమికులను వేరే లోకంలో వివహరించేలా చేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రోమోలో మహేష్ లుక్స్, కీర్తి అందం హైలైట్ గా నిలిచాయి. వైట్ కలర్ టీ షర్ట్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ తో మహేష్, ఆయనకు తగ్గట్టు తళుకులీనుతున్న చీరలో కీర్తి అదిరిపోయారు. ఒక వెయ్యో .. ఒక లక్షో మెరుపులు కిందకు దూకాయో .. ఏంటో ఈ మాయ అంటూ కీర్తి అందాన్ని పోగొడుతూ ప్రేమ పరవశంలో మునిగి మెలికలు తిరుగుతూ కనిపించాడు మహేష్. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా సమ్మర్ కానుకగా మే లో విడుదల కానుంది. ఏదిఏమైనా ఈ సినిమాలో పోకిరి మహేష్ కనిపిస్తున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.