Anil Ravipudi: టాలీవుడ్లో కమర్షియల్ హంగులతో వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు అనిల్ రావిపూడిది అందె వేసిన చెయ్యి. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘పటాస్’. నందమూరి కల్యాణ్ రామ్‌ను మాస్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్న పటాస్ సినిమా గురించి ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటి, డైరెక్టర్ అనిల్ రావిపూడికి పటాస్ హీరోగా ఫస్ట్ ఛాయిస్…
Prabhas: సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. “డార్లింగ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్, సీనియర్స్ అంటే సీనియర్సే. ఏ సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేము, సీనియర్స్ తర్వాతే మేము 100% అంటూ చెప్పుకొచ్చారు. సంక్రాంతికి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వాలి, మాది…
Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన ప్రసంగం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. “డార్లింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యు! మొన్న జపాన్‌లో ఇలాంటివన్నీ చేశాను అంటూ లవ్ సింబల్ చూపించారు. మీకు నచ్చిందని ఈ పిలక కూడా వేసుకున్నానని అన్నారు. ఈ చలిలో ఎంతమంది వచ్చారు! ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి, జాగ్రత్త. టూమచ్ చలి ఉంది. ఎక్కడి నుంచి మొదలుపెడదాం? READ ALSO: Vijay Jananayagan: ఇక్కడ అవి…
Prabhas: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్టు చేస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అనేక వాయిదాల అనంతరం సినిమాని వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూకట్పల్లి, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, ప్రభాస్ గురించి, సినిమా గురించి చాలా సేపు మాట్లాడారు. అయితే ప్రభాస్ గురించి మాట్లాడుతున్న సమయంలో మాత్రం ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్…
ఈ మధ్యకాలంలో నటుడు శివాజీ, హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఇచ్చిన సలహా ఎంత వైరల్ అయిందో, ఎంత వివాదానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్రవంతి యాంకర్‌గా వ్యవహరించింది. ఆ రోజు ప్రపంచ చీరల దినోత్సవం కావడం, అదే రోజు ఆమె నిండుగా చీర కట్టుకుని రావడంతో శివాజీ ఆమెను ప్రశంసించే ప్రయత్నం చేస్తూనే హీరోయిన్లకు సలహా ఇచ్చారు. సలహా ఇవ్వడంలో భాగంగా సామాన్లు, “దరిద్రపుగొట్టు…” అంటూ…
జబర్దస్త్ ద్వారా ఊహించని క్రేజ్ సంపాదించి, ప్రస్తుతం వెండితెరపై నటుడిగా రాణిస్తున్న గెటప్ శ్రీను, సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూయర్ల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల కాలంలో రివ్యూల పేరుతో జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, హేళనలపై ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ.. భవిష్యత్తులో రివ్యూలు ఎంత విడ్డూరంగా మారబోతున్నాయో ఉదాహరణలతో వివరించారు. సినిమా రివ్యూలు అనేవి ఒక కళాఖండాన్ని గౌరవించేలా ఉండాలి తప్ప, కించపరిచేలా…
టాలీవుడ్లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపగా, ఆ వివాదం ఇప్పుడు నటి అనసూయ భరద్వాజ్ వర్సెస్ శివాజీగా మారిపోయింది. తన వయసును, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటు కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం ఎలా ఉండాలో చెబుతూనే, తనను ‘ఆంటీ’ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తున్న వారికి చురకలు అంటించారు. కొంతమంది పురుషులు, మహిళలు కూడా తన వయసును…
సినీ నటి మంచు లక్ష్మి నేడు (మంగళవారం) ఉదయం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. లక్డీకపూల్‌లోని ఆఫీసులో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ యాప్‌ల ప్రచారం కోసం ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు? కమీషన్ల రూపంలో ఎంత వెనకేశారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఈనాటిది కాదు. గతంలో ఇదే వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్…
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అక్కినేని నాగార్జున స్పందిస్తూ అదంతా కేవలం రూమర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. ఒక ఈవెంట్లో నాగార్జునను ‘మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోషన్ పొందుతున్నారా?’ అని అడగ్గా.. ఆయన ‘సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను’ అని సరదాగా సమాధానం ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన ఈ మర్యాదపూర్వకమైన…
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘తండేల్’ తర్వాత ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మిస్టిక్ థ్రిల్లర్‌లో నటిస్తున్నా విషయం తెలిసిందే. సుకుమార్ సమర్పణలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, చైతూ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ పరంగా రికార్డు బిజినెస్ చేస్తూ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్…