తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపేసిన టాలీవుడ్ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలే ఇది విచారణ ఎదుర్కున్న సెలబ్రిటీలకు మళ్లీ గుండెల్లో గుబులు మొదలైంది. తాజాగా ఈడీ మరోసారి డ్రగ్ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వాల్సిందిగా ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. ఇటీవల ఈ కేసు పూర్తీ వివరాలను, రిపోర్టులను ఈడీ కి ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఎక్సైజ్ శాఖకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి ఆ రిపోర్టులను తమకు స్వాధీనం చేయాల్సిందిగా ఈడీ, ఎక్సైజ్ శాఖను కోరింది.
మొన్నటికి మొన్న ఈడీ విచారణలో కెల్విన్ కి సంబంధించిన కొన్ని వివరాలను రాబట్టిన ఈడీ ఈసారి పూర్తిగా ఈ కేసుపై దృష్టిపెట్టనుంది. ఇక మరోసారి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సెలబ్రిటీలందరూ మరోసారి విచారణకు హాజరు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో విచారణ జరగని వారిని కూడా ఈసారి విచారిస్తారని తెలుస్తోంది. ఇక పోయినసారి విచారణ చూసుకుంటే కొండను తవ్వి ఎలుకను తీసినట్లు.. ఎన్నో రోజులు ఎంతోమంది సెలబ్రిటీలను విచారణ చేశారు కానీ ప్రయోజనము మాత్రం ఏం దక్కలేదు. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు ప్రజలు.