ప్రసుతం టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా తమ సత్తా చాటుకొని ఆ హీరోల చేతే ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, తారక్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు బాలీవుడ్ లో పాగా వేసేశారు. వీరి గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు ఓ రేంజ్ లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, రామ్ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ సెషన్ చేసిన రణవీర్ కి ఒక నెటిజన్ రామ్ చరణ్ గురించి చెప్పమని అడిగాడు.
ఇక దీనికి సమాధానంగా ఈ యంగ్ హీరో ” అతనొక మృగం.. ఒక పరిపూర్ణ యంత్రం.. మగధీర చూసినప్పటి నుంచి చెర్రీని అభిమానిస్తున్నాను.. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. పనిలో రాక్షసుడు.. ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు అని చెర్రీని , రణవీర్ పొగడడంతో చరణ్ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇక ఈ మాటల్తో బాలీవుడ్ లో చరణ్ రేంజ్ ఏంటి అనేది తెలుస్తోంది. ఇక చరణ్ తో రణవీర్ కి మంచి స్నేహ బంధమే ఉంది. చరణ్ – శంకర్ సినిమా పూజా కార్యక్రమానికి రణవీర్ ముఖ్య అతిధిగా పాల్గొన్న సంగతి తెలిసిందే..