సినిమా .. ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. అలా నమ్మితే మోసపోవడం ఖాయం. ఎంతోమంది మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తారు. తాజగా ఒక నిర్మాత కూడా ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన శారీరక కోరికలు తీర్చుకొని పెళ్లి అనేసరికి ముఖం చాటేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక అతడి బెదిరింపులు తట్టుకోలేని ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిర్మాత గుట్టు బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం…
చాయ్ బిస్కెట్ నుంచి గత ఏడాది లాక్డౌన్లో విడుదలైన వెబ్ సిరీస్ ’30 వెడ్స్ 21′. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్ లాక్డౌన్లో అందరినీ అలరించింది. చైతన్య, అనన్య జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది. అసమర్థుడు, మనోజ్ పీ సంయుక్తంగా రెండో…
ఫిబ్రవరి నెల తొలి శుక్రవారం (4వ తేదీ) థియేటర్లలో చిన్న చిత్రాలు సందడి చేయబోతున్నాయి. శుక్రవారం దగ్గరకు వస్తుంటే… వరుసగా సినిమాల విడుదల ప్రకటన జోరందుకుంటోంది. ఆదివారం నాటికి ఫిబ్రవరి 4న విడుదల కాబోతున్న చిత్రాల సంఖ్య ఏకంగా ఏడుగా తేలింది! విశాల్ ‘సామాన్యుడు’ సినిమాను తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో శుక్రవారం విడుదల చేస్తున్నాడు. అలానే శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ చిత్రమూ ఫిబ్రవరి 4న రిలీజ్ కాబోతోంది. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవి…
గద్దర్ పేరు వినగానే ఆయన ముందున్న ప్రజాగాయకుడు అన్న బిరుదు గుర్తుకు వస్తుంది. ప్రజల పక్షాన నిలచి, వారి కష్టాలను తన గళంలో నింపి ఊరూరా వాడవాడలా పల్లవించి, ప్రభుత్వాలను దారికి తీసుకు వచ్చిన కళాకారుడు గద్దర్. ఆయన పుట్టిన తేదీపై పలు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే చాలామంది జనవరి 30వ తేదీన గద్దర్ పుట్టినరోజు అని చెబుతారు. ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. బ్రిటిష్ రాజ్యంలో తెల్లవారి పాలనను వ్యతిరేకిస్తూ…
రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలోనూ రాత్రి కర్ఫ్యూను, వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తివేశారు. సో… సినిమా నిర్మాతలూ కాస్తంత ఊపిరి పీల్చుకుని ఆశావాహ దృక్పథంతో థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అలా దాదాపు రెండేళ్ళ క్రితం మొదలై, విడుదల కాకుండా ఆగిపోయిన శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ సినిమా సైతం ఫిబ్రవరి 4న జనం…
కొణిదెల అంజనా దేవి.. ఈ పేరు ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. చిత్ర పరిశ్రమకు ముగ్గురు రత్నాల్లాంటి బిడ్డలను అందించింది. చరిత్ర గుర్తుంచుకొనే హీరోలను తయారుచేసింది. మెగాస్టార్ మాతృమూర్తిగా నిత్యం అందరి హృదయాల్లో కొలువున్న అమ్మ అంజనా దేవి. నేడు ఆమె పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అమ్మకు అపురూపంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా బ్రదర్స్. “అమ్మా! జన్మదిన శుభాకాంక్షలు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ…
సంక్రాంతి బరి నుండి తప్పుకొన్న ‘సామన్యుడు’ రిపబ్లిక్ డేకు వస్తుందని అప్పట్లో హీరో విశాల్ చెప్పాడు. అయితే… పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ తేదీన కూడా ‘సామాన్యుడు’ సినిమా విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విశాల్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా ద్వారా తు. ప. శరవణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. కరోనా సమయంలో కూడా అమ్మడి షెడ్యూల్ బిజీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో విజయ ఢంకా మొదలుపెట్టిన బుట్టబొమ్మ ఆచార్య, రాధేశ్యామ్ తో విజయాన్ని కంటిన్యూ చేస్తుందని అనుకున్నారు. కానీ, కరోనా తో ఆ రెండు సినిమాలు వాయిదా పడడంతో అమ్మడికి బ్రేక్ పడింది. ఇక ఇటు పక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను…