బైసారన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక నేపాలీ జాతీయుడితో సహా ఇరవై ఆరు మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘోరమైన కాల్పులకు పాల్పిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉన్నత సైనిక శిక్షణ పొందారని నిఘా వర్గాలు తెలిపాయి.
Terror threat: జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయా జైళ్ల దగ్గర భద్రతాను భారీగా పెంచేశారు. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు సూచించాయి.
బైసరన్ లోయను తమ ఆధీనంలోకి ఉగ్రవాదులు తీసుకుంటున్న విజువల్స్ ను అందులో చూపించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన సమయంలో తాను జిప్ లైన్‌లో ఉన్నానని తెలిపాడు.. ఆ వీడియోలో, నా వెనుక ఉన్న ఒక వ్యక్తి 'అల్లాహు అక్బర్' అని అరుస్తున్నట్లు మీరు చూడవచ్చు.. ఆ వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాడు.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడితో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాది దేశానికి భారత్ తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పీవోకేలో గల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తుంది.
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టెర్రరిస్టుల మీద ఫైర్ అయ్యాడు. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ముందుగా పహల్గాం బాధితులకు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టెర్రరిస్టులపై నిప్పులు కురిపించారు. ‘ఇప్పుడు కశ్మీర్…
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాను వీరమరణం పొందారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా.. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈరోజు ఉదంపూర్‌లోని బసంత్‌గఢ్‌లో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఇరు వైపుల నుంచి భారీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ఉధంపూర్‌లోని డూడులో జరుగుతోంది. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గత 24 గంటల్లో…
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉధంపూర్ జిల్లాలోని రామ్‌నగర్‌లో మార్తా గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర దళాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులను కనుగొన్నారు. ఈ కాల్పుల్లో 2-3 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమాచారాన్ని డీఐజీ ఉదంపూర్-రియాసీ రేంజ్ రైస్ మహ్మద్ భట్ తెలిపారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత…
ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు. ఉగ్రవాదులు తమ ఇళ్లలో కూడా సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు. భయం భయంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోడీ అన్నారు. శనివారం హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రధాని ఉగ్రవాదం, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై కూలంకషంగా చర్చించారు.
Kulgam Encounter: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత దేశ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని ఎల్‌ఓసీకి ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లాలో సైనికులు నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఎన్‌కౌంటర్ ప్రారంభంలో కొన్ని కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఎన్‌కౌంటర్ స్థలం చుట్టూ భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి.…
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చాస్, కొత్వాడా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 2 పారా (SF)కి చెందిన ఎన్‌బీ సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేష్ కుమార్ వీరమరణ పొందారు. సబ్-ఇన్‌స్పెక్టర్ రాకేష్ 09 నవంబర్ 2024న భారత్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించిన జాయింట్ సీఐ ఆపరేషన్‌లో భాగమని సైన్యం తెలిపింది.