Terror Attack In J&K: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన సోఫియాన్ (25), ఉస్మాన్ మాలిక్ (25) శ్రీనగర్‌లోని జెవీసీ ఆసుపత్రి బెమీనాలో చేర్చారు.
దేశంలోని హోటల్ పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన తాజ్ హోటల్ మళ్లీ ఉగ్రవాదుల టార్గెట్‌గా మారింది. అయితే 2008లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి లక్నోలోని తాజ్ హోటల్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సోమవారం హజ్రత్‌గంజ్‌లోని ఈ హోటల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ హోటల్‌లో బాంబు లేదా ఉగ్రవాద దాడి గురించి మాట్లాడినప్పుడల్లా.. 2008 సంవత్సరం యొక్క భయంకరమైన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.
టెంపుల్ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.. నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి.. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు..
Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు సహా ఆరుగురు కార్మికులు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.
Amit Shah: జమ్మూ కాశ్మీర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదులతో శాంతికి సిద్ధమే అని ప్రకటించారు. ఆయుధాలు వదులుకుని, ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని లేదా భద్రతా బలగాల చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా గురువారం కోరారు.
Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటివరకు చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇదే సమయంలో మన సైనికులు కూడా చాలా మంది వీరమరణం పొందారు. శుక్రవారం, జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు ఆర్మీ సైనికులు కూడా గాయపడ్డారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. రహస్య సమాచారం ఆధారంగా…
Indian Army: జమ్మూ అండ్ కాశ్మీర్ లో వరుసగా ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా స్థానిక భద్రతను పెంపొందించడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDGs)కి శిక్షణ ఇవ్వడానికి భారత సైన్యం, జమ్మూ పోలీసులు ముందుకు వచ్చారు.