Terror Threat: జమ్మూలోని జైళ్లపై ఉగ్రవాద దాడి జరిగే ఛాన్స్..
- జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం..
- శ్రీనగర్ సెంట్రల్ జైలు, కోట్ బల్వాల్ జైలుపై దాడి జరిగే ఛాన్స్ ఉందన్న నిఘా వర్గాలు..
- హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్న జైళ్ల వద్ద భారీ భద్రతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror threat: జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయా జైళ్ల దగ్గర భద్రతాను భారీగా పెంచేశారు. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు సూచించాయి. ఈ జైళ్లలో ప్రస్తుతం అనేక మంది హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు.. వీరు దాడులలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఉగ్రవాదులకు సహాయం చేసినందుకు వీరు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక, సీఐఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆదివారం నాడు శ్రీనగర్‌లోని భద్రతా గ్రిడ్ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని అంచనా వేశారు. జైళ్ల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Read Also: Pakistan: సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పులు.. బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
అయితే, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన వారం రోజుల తర్వాత ఉగ్రవాదులు ఇప్పటికీ దక్షిణ కాశ్మీర్‌లో దాక్కుని ఉండవచ్చని NIA వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ మంది ఉగ్రవాదులు దాక్కుని ఉండవచ్చని విశ్వసనీయ సమాచారం వచ్చిందన్నారు. కాగా, ఇప్పటికే ఉగ్రవాద సహచరులైన నిసార్, ముష్తాక్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నించగా.. వీరికి ఆర్మీ వాహనంపై దాడి కేసుతో సంబంధం ఉందని ఒప్పుకున్నట్లు తేలింది. ఇక, ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన దాడితో భారత భద్రతా దళాలు అలర్ట్ కావడంతో.. మిగిలిన ఉగ్రవాదులు దాడులకు విరామం ఇచ్చారనే అనుమానాలు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది.
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..