Terrorists Training In Pak: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో సైనిక శిక్షణ
- పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల గాలింపు..
- బైసారన్ లోయ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో సైనిక శిక్షణ..
- లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లలో పని చేసిన టెర్రరిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorists Training In Pak: మినీ స్విట్జర్లాండ్”గా పిలువబడే బైసారన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక నేపాలీ జాతీయుడితో సహా ఇరవై ఆరు మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘోరమైన కాల్పులకు పాల్పిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉన్నత సైనిక శిక్షణ పొందారని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి ఈ శిక్షణ వారు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొనింది. ఇప్పటికే జైలులో ఉన్న కొంతమంది ఉగ్రవాదులను విచారించినప్పుడు ఈ సమాచారాన్ని బయట పెట్టారని అధికారులు తెలిపారు.
Read Also: Babil Khan : బాబిల్ ఖాన్ పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ డైరెక్టర్..
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
కాగా, పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరైన హషీమ్ ముసా గతంలో పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో పారా-కమాండోగా పని చేశాడు. తరువాత అతను లష్కరే తోయిబాలో చేరాడు. ఇక, అప్పటి నుంచి అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నాడు. అయితే, 2023లో భారతదేశంలోకి ప్రవేశించినట్లు తెలిసింది.. అప్పటి నుంచి అతను జమ్మూ కాశ్మీర్ అంతటా జరిగిన ఆరు ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు తేలింది. గత ఏడాది అక్టోబర్లో గండేర్బల్ జిల్లాలో జరిగిన దాడిలో ఏడుగురు, బారాముల్లాలో జరిగిన దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు.
Read Also: RCB Fan : ఆర్సీబీ గెలవకపోతే… నా భార్యకు విడాకులు ఇస్తా..!
అయితే, దక్షిణ కాశ్మీర్ అడవుల్లో హషీమ్ మూసా ఎక్కడో దాక్కున్నాడని భారత భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అతడ్ని పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆ ఉగ్రవాది గురించి ఏదైనా సమాచారం ఇచ్చిన వారికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు రూ. 20 లక్షల బహుమతిని ప్రకటించారు. అలాగే, సమాచారం ఇచ్చేవారి గుర్తింపును గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన ముసాతో సహా అందరు ఉగ్రవాదులు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లేదా హిజ్బుల్ ముజాహిదీన్‌లలో ప్రస్తుతం పని చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!