PM Modi: ఉగ్రవాదులు భారత్‌ను భయ పెట్టలేరు.. ఎందుకంటే..
- పాకిస్థాన్‌కు మోడీ సవాల్
- 26/11 దాడికి సంబంధించి అంశంపై మాట్లాడిన మోడీ
- ఇప్పుడు పరిస్థితి మారిందన్న ప్రధాని
- ఉగ్రవాదులు వాళ్ల సొంత గడ్డపైనే ఉండలేక పోతున్నారన్న పీఎం
- హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మోడీ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు. ఉగ్రవాదులు తమ ఇళ్లలో కూడా సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు. భయం భయంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోడీ అన్నారు. శనివారం హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రధాని ఉగ్రవాదం, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై కూలంకషంగా చర్చించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్ల కథనాలను వీక్షించిన ఆయన ఆ ఘటనపై స్పందించారు. ‘‘ఈ రోజు నేను 26/11 దాడికి సంబంధించిన నివేదికలను ఎగ్జిబిషన్‌లో చూశాను. ఆ సమయంలో ఉగ్రవాదం భారతీయులకు పెద్ద ముప్పు. ప్రజలు సురక్షితంగా లేరని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు తమ సొంత ప్రదేశాల్లో కూడా సురక్షితంగా లేరు. భయంభయంగా బతుకుతున్నారు. ఇక, వారు మనల్ని భయపెట్టలేరు’’ అని ఆయన అన్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు..
అనంతరం మోడీ తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉందని అన్నారు. ‘ప్రజల కోసం, ప్రజలచే అభివృద్ధి’ అనేది తమ ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యమన్నారు. తాము ప్రజా ప్రయోజనాల దిశలో మాత్రమే పయణిస్తున్నామన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశాన్ని సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం, భారతీయులు తమ నమ్మకాన్ని అందించారని, ఆ నమ్మకాన్ని పూర్తి చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం, పుకార్లను కూడా ఆయన ప్రస్తావించారు.
Also Read
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
యువతలో రిస్క్ తీసుకునే స్ఫూర్తి..
స్వాతంత్య్రానంతరం భారతదేశంలో యువతలో రిస్క్ తీసుకునే స్ఫూర్తి కొరవడిందని, అయితే గత 10 ఏళ్లలో ఇది పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో 1.25 లక్షలకు పైగా నమోదైన స్టార్టప్‌లు ఉన్నాయని, మన యువత దేశం గర్వించేలా చేయాలని ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్యం, ఉపాధి కల్పన పథకాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. “మన దేశంలో మరుగుదొడ్లు నిర్మించాలనే ప్రచారం ప్రారంభించబడింది. ఈ పథకం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో మాత్రమే కాకుండా ఉపాధిని సృష్టించడం, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో సహాయపడింది. ఈ పథకం గౌరవం, భద్రతను అందిస్తుంది.” అని తెలిపారు.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..