పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదం పెచ్చుమీరుతోంది. ఇక్కడ సైన్యానికి-ఉగ్రవాదుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఐసిస్ దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. పహల్గామ్ ఉగ్రవాదులు సహా పలువురు హతమయ్యారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీలను ఐబీ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు ఉగ్రవాదుల నివాసాల్లో మంగళవారం జరిపిన సోదాల్లో భారీగా మందుగుండు సామగ్రి పట్టుబడింది. సిద్ధిక్ నివాసంలో 4 కిలోల ఆర్డీఎక్స్, డిటొనేటర్ వైర్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అలీ నివాసంలో పేలుళ్లకు ఉపయోగించే వైర్లను పోలిసులు గుర్తించారు. గురువారం రాత్రి మరోసారి టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్…
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఒకపక్క రాయచోటి పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాలలో పోలీసులు గస్తీ కాస్తుండగా, మరోపక్క టెర్రరిస్టుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఉగ్ర కలకలం సృష్టిస్తోంది.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు.. పలు బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదునలు.. రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని తమిళనాడుకు తరలించారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనా ముందే పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది.. దాన్ని అరికట్టడానికి సరిహద్దు దాటిన టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడానికి మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పేర్కొన్నారు.
కొలరాడోలోని బౌల్డర్‌లో ఆదివారం జరిగిన ఉగ్ర దాడిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు.
Terrorists: పహల్గామ్ ఉగ్రవాద దాడితో వణికిపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను మరో సమస్య వెంటాడుతుంది. టెర్రరిస్టులు సైనికుల దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతుంది.. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు స్థానిక ప్రజలు.
పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. భారతదేశం ఇజ్రాయెల్ కాదు.. పాకిస్తాన్ పాలస్తీనా కాదని అన్నారు. అలాగే, కాశ్మీర్ అంశంపై కూడా అతడు భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు.
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ ను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.