ఇటీవల జమ్మూకాశ్మీర్ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్ జిల్లా మెంధార్ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్‌పీఎఫ్…
దేశంలో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. గతంలో సైనికులను టార్గెట్ చేసుకొని దాడులు జరిపే ఉగ్రవాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మణిపూర్‌లోనూ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. మణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ జిల్లాలోని బి గామ్నోవ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయక పౌరులు మృతి చెందారు. దీంతో…
జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు.. పూంచ్ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.. ఇవాళ ఉదయం పూంచ్ సెక్టార్‌లో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల కోసం ఆర్మీ, స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక బృందం వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులుకు తెగబడ్డారు ఉగ్రవాదులు.
భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చిరించాయి. భారత్‌లోని చొరబడేందుకు 40మంది ఆఫ్ఘన్ ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ మద్ధతుతో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చిరించాయి. జమ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దేశంలో రాబోయే పండగ రోజుల్లో దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్టు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చారు. 1996 నుంచి 2001 వరకు తాలిబన్లు ఆఫ్ఘన్‌లో అరాచక పాలన సృష్టించారు. ఈ పాలన తరువాత, అమెరికా దళాలు ఆఫ్ఘన్‌లోని ముష్కరులపై దాడులు చేసి తాలిబన్లను తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. 20 ఏళ్లపాటు అమెరికా, నాటో దళాలు అక్కడే ఉన్నాయి. 2021 ఆగస్టు 31 వరకు పూర్తిగా అమెరికన్ దళాలు ఆఫ్ఘన్‌ను వదలి వెళ్లిపోయాయి. దీంతో మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు…
పుల్వామాలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతం అయ్యారు. పుల్వామాలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కాసమాచారంతో ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ కలిసి జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ చేస్తుండగా పాక్ కు చెందిన లష్కర్ ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. సైన్యం ఎదురుకాల్పులు జరిపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం పుల్వామాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూను విధించారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ జవాన్లు…
జూన్ 27 వ తేదీన డ్రోన్ సహాయంతో భారత వైమానిక స్థావరంపై దాడులు చేశారు ముష్కరులు. డ్రోన్‌ల నుంచి తెలికపాటి ఐఈడి బాంబులు జారవిడిచిన ఘటనలో వైమానిక స్థావరం పైకప్పు దెబ్బతిన్నది. కానీ, వెంటనే అప్రమత్తమైన ఆర్మీ సిబ్బంది డ్రోల్‌లపై కాల్పులు జరపడంతో తప్పించుకుపోయాయి. అయితే, ఆ ఘటన తరువాత భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. డ్రోన్ కదలికలపైన దృష్టిసారించింది. ఇక ఈ డ్రోన్‌ల నుంచి జారవిడిచిన ప్రెజర్ ప్యూజులు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ ప్యూజులను…
ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పదేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు.. హిందూ నేతలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారని.. వీరిని 2012లో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్రలు కూడా చేసినట్టు నిర్ధారించారు.. సౌదీలో శిక్షణ తీసుకున్న అక్రం… హైదరాబద్ కు చెందిన…
జమ్మూకాశ్మీర్ కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు. ముఖ్యంగా భద్రత దళాలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడికి ఉగ్రవాదులు ఒడిగట్టారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ లో సిఆర్పిఎఫ్ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై గ్రానైట్ రాళ్లతో దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. మరో పోలీసు, ముగ్గురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్ తోయిబా…