Kulgam Encounter: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత దేశ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని ఎల్‌ఓసీకి ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లాలో సైనికులు నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఎన్‌కౌంటర్ ప్రారంభంలో కొన్ని కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఎన్‌కౌంటర్ స్థలం చుట్టూ భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి. అనుమానిత ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి, ఈ ఎన్‌కౌంటర్‌లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ మొదలయింది.
Read Also: Death: మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? నర్స్ చెప్పిన విషయాలు వైరల్..
అలాగే, కుప్వారాలోని నాగ్‌మార్గ్‌లో ఎన్‌కౌంటర్ కొనసాగింది. ఈ ప్రాంతం బందిపోరా జిల్లాకు ఆనుకొని ఉంది. ఇది కాకుండా ఈ ప్రాంతం LOC సరిహద్దులో ఉంది. కాశ్మీర్ లోకి చొరబడే ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని బండిపోరా, సోపోర్, గందర్‌బాల్, శ్రీనగర్ మీదుగా దక్షిణ కాశ్మీర్‌కు చేరుకుంటారు. మరోవైపు, నాగ్‌మార్గ్‌లో ఉగ్రవాదులు కనిపించారనే సమాచారంతో భద్రతా బలగాలు తెల్లవారుజామున ఆపరేషన్ ప్రారంభించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాస్త ఎత్తులో దట్టమైన చెట్ల కింద ఉగ్రవాదులు దాక్కున్నారు. వారిని చుట్టుముట్టేందుకు ఒక భద్రతా బలగాలు కుప్వారా నుంచి, మరో స్క్వాడ్ బండిపోరా జిల్లాలోని రుబందీపూర్ ప్రాంతం నుంచి బయలుదేరాయి. సీజ్‌లో ఉన్న వారిని చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో సైనికులు కూడా తమను తాము రక్షించుకోవడానికి ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు గంటపాటు ఇరువైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరిగాయి. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది హతమయ్యారో ఇంకా సమాచారం లేదు.