జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చాస్, కొత్వాడా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 2 పారా (SF)కి చెందిన ఎన్‌బీ సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేష్ కుమార్ వీరమరణ పొందారు. సబ్-ఇన్‌స్పెక్టర్ రాకేష్ 09 నవంబర్ 2024న భారత్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించిన జాయింట్ సీఐ ఆపరేషన్‌లో భాగమని సైన్యం తెలిపింది. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనలో మరో ముగ్గురు కమాండోలు గాయపడినట్లు పేర్కొంది.
నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ ఎంతో ధైర్యంతో ఉగ్రవాదులతో పోరాడి అమరుడైనట్లు వైట్ నైట్ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వెల్లడించింది. ఇటీవల ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులైన నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా కిష్త్వార్ అడవులలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరుపుడంతో ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
READ MORE: Bangladesh: షేక్ హసీనాను ఇండియా నుంచి రప్పించాలి.. ఇంటర్‌పోల్ సాయం కోరిన బంగ్లా..