Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ పోలీసులు కథువా జిల్లాలోని మల్హర్, బానీ, సియోజ్‌ధర్‌లోని ధోక్స్‌లలో చివరిగా కనిపించిన నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ ఫోటోలను విడుదల చేశారు.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55).. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన.. 1993లో ఇంగ్లాండ్ తరుఫున అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో గ్రాహం థోర్ప్ 16 సెంచరీలు సాధించాడు. అలాగే 6744 పరుగులు చేశాడు..
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత భారత భద్రతా సంస్థలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో ఉన్న భారత సరిహద్దులను పూర్తి నిఘాతో పర్యవేక్షిస్తున్నారు.
ఉగ్రవాదులను అంతమొందించేందుకు పోలీసులు సరికొత్త టెక్నాలజీ తీసుకురానున్నారు. రాత్రి వేళల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. సహచరులను గుర్తించేందుకు, శత్రువులను కచ్చితంగా టార్గెట్ చేసేందుకు ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఐదు వేల వ్యూహాత్మక సామగ్రిని పోలీసులు కొనుగోలు చేయనున్నారు. ఇందులో వెయ్యి ఇన్‌ఫ్రారెడ్ లైట్ లేజర్‌లు, 4 వేల ఇన్‌ఫ్రారెడ్ ప్యాచ్‌లు ఉన్నాయి. ఇన్‌ఫ్రారెడ్ లేజర్ రాత్రిపూట 800 మీటర్ల దూరం వరకు శత్రువును చూస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ MQ-9B ప్రిడేటర్. ఇలాంటి 31 డ్రోన్‌లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.25,955 కోట్ల కంటే ఎక్కువ.
జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాద దాడులు ఎక్కువయ్యాయి. ఉగ్రవాదులు ఆర్మీ సిబ్బందిపై దాడి చేసి దాక్కుంటున్న తీరు..స్థానికులపై అనుమానాన్ని రేకిత్తిస్తోంది.
Breaking: దేశవ్యాప్తంగా ఎంతో ప్రముఖ్యత కలిగిన అమర్‌నాథ్ యాత్రలో విధ్యంసం సృష్టించేందుకు ఐసీస్ భారీ కుట్ర పన్నింది. దీని కోసం బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి ఐఎస్ఐ ఈ కుట్రకు ప్లాన్ చేసింది.
Encounter in Kupwara: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. ఉత్తర కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు.
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులపై ఈ ఆపరేషన్ చేపట్టారు.
ఈ మధ్య కాలంలో జమ్మూ అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోయింది. సామాన్య ప్రజలతో పాటు సైన్యం కూడా తీవ్రవాదుల వలలో చిక్కుకుంది. పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.