Mali: జిహాదీకి వ్యతిరేకంగా వీడియోలు.. మహిళా టిక్‌టోకర్‌ను చంపిన ఉగ్రవాదులు
- జిహాదీకి వ్యతిరేకంగా వీడియోలు
- మహిళా టిక్‌టోకర్‌ను చంపిన ఉగ్రవాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదం పెచ్చుమీరుతోంది. ఇక్కడ సైన్యానికి-ఉగ్రవాదుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఐసిస్ దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇటీవల ఐదుగురు భారతీయ కార్మికులను కూడా కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు వారి జాడ కూడా కనిపించలేదు. ఇంతలోనే ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పూనుకున్నారు. జిహాదీకి వ్యతిరేకంగా వీడియోలు చేసిందన్న కారణంగా ఒక మహిళా టిక్‌టోకర్‌ను బహిరంగంగా ఉరితీసి చంపేశారు.
ఇది కూడా చదవండి: Bhopal: భోపాల్‌లో ఘోర విషాదం.. రోడ్డుప్రమాదంలో ఆసియా కప్ విజేత దుర్మరణం
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
2012 నుంచి మాలిని ఉగ్రవాదం పట్టిపీడిస్తోంది. జిహాదీకి వ్యతిరేకంగా సైన్యం పోరాడుతుంది. అయితే తాజాగా మరియం సిస్సే అనే మహిళా టిక్‌టోకర్ సైన్యానికి సహకరిస్తుందన్న కారణంగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం బహిరంగంగా ఉరి తీసి చంపేశారు. మరియం సిస్సే మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కిడ్నాప్ చేసి.. అనంతరం ఉరితీశారని తెలిపారు. గురువారం తన సోదరిని జిహాదీలు తీసుకెళ్లారని.. మరుసటి రోజు బైక్‌పై టోంకాకు తీసుకెళ్లినట్లు తెలిపాడు. అనంతరం ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో కాల్చి చంపేశారని చెప్పాడు. అందరూ చూస్తుండగానే చంపేశారని వాపోయాడు.
ఇది కూడా చదవండి: Odisha: జాజ్‌పూర్‌లో హడలెత్తించిన కీటకాల దండు.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డ బైకర్లు
మరియం సిస్సే.. ఉత్తర టింబక్టు ప్రాంతంలోని టోంకా నగరం గురించి వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఈమెకు 90,000 మంది అనుచరులు ఉన్నారు. అయితే యువతి సైన్యానికి సహకరిస్తుందన్న కారణంతో చంపేసినట్లుగా సమాచారం. ఇది అనాగరిక చర్యగా స్థానిక అధికారి పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!