Terrorists: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దీంతో జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ ను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ డీకే పోరా ప్రాంతంలో కొనసాగింది.
Read Also: Naveen Polishetty : సంచలన దర్శకుడితో నవీన్ పోలిశెట్టి మూవీ..?
అయితే, సెర్చ్ ఆపరేషన్ లో భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులతో పాటు రెండు పిస్టల్స్, నాలుగు గ్రనేడ్‌లు, 43 లైవ్ రౌండ్లు, ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే, షోపియాన్ ప్రాంతంలో భారీ ఎత్తున ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.