Colorado Attack: యూదు వ్యతిరేకుల వీసాలను రద్దు చేస్తాం.. అమెరికా హెచ్చరిక
- యూదు వ్యతిరేకుల వీసాలను రద్దు చేస్తాం
- కొలరాడో ఉగ్ర దాడి తర్వాత అమెరికా హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొలరాడోలోని బౌల్డర్‌లో ఆదివారం జరిగిన ఉగ్ర దాడిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉగ్ర సానుభూతిపరులను గుర్తించి వారి వీసాను రద్దు చేసి.. దేశం నుంచి బహిష్కరిస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వీసాలు రద్దు చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆప్ సిందూర్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ‘నో’ చెప్పిన కేంద్రం.!
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
గాజాలో బందీలకు మద్దతుగా యూదులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే ఈజిప్ట్‌కు చెందిన మొహమ్మద్ సబ్రీ సోలిమాన్.. యూదులు లక్ష్యంగా సీసా బాంబులను విసిరాడు. మోలోటోవ్ కాక్‌టెయిల్స్‌ను ప్రయోగించాడు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. 88 ఏళ్ల హోలోకాస్ట్ ప్రాణాలతో బయటపడింది. ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నిందితుడు సోలిమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Minister Anagani Satya Prasad: జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి..!
ఇక విచారణలో సోలిమాన్ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించాడు. తన బిడ్డ చదువు కోసం ఇన్నాళ్లు ఆగనని.. లేదంటే ఎప్పుడో యూదుల లక్ష్యంగా దాడులు చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. తుపాకీతో కాల్చాలని అనుకున్నానని.. కాకపోతే అమెరికా పౌరుడును కాదు కాబట్టి తనకు గన్ లైసెన్స్ రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక దాడి సమయంలో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. పాలస్తీనాకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశాడు.
వాస్తవానికి మొహమ్మద్ సబ్రీ సోలిమాన్ వీసా గడువు ముగిసింది. అయినా కూడా అక్రమంగా అమెరికాలో ఉంటున్నాడు. 2023, ఫిబ్రవరిలో బీ2 వీసాతో సందర్శన సాకుతో అమెరికా వచ్చాడు. దాని గడువు ముగిసింది. అయినా కూడా అక్రమంగా ఉంటున్నాడు. సోలిమాన్.. ఏడాది కాలంగా దాడి చేయడానికి కుట్ర పన్నినట్లుగా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఎక్స్‌లో తెలిపారు. దాడి చేశాక అతడు కూడా చనిపోవాలని ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ అనుకున్నది చేయకపోతే తనను తాను క్షమించుకోనని చెప్పినట్లు పేర్కొన్నారు.
సోలిమాన్‌పై హత్యాయత్న అభియోగాలు మోపబడ్డాయి. దోషిగా తేలితే జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక ఇటీవల ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర ఇద్దరి అధికారులను దుండగుడు కాల్పులు జరిపి చంపేశాడు. ఈ నిందితుడు కూడా పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు.
In light of yesterday’s horrific attack, all terrorists, their family members, and terrorist sympathizers here on a visa should know that under the Trump Administration we will find you, revoke your visa, and deport you.
— Secretary Marco Rubio (@SecRubio) June 2, 2025
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!