శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చాలా లాభపడింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది.
టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ (ICC) షాక్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
2025లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధతకు తెరదించేలా ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. భారత మ్యాచ్లకు వేదికగా దుబాయ్ను ఎంపిక చేసిందని అనేక కథనాలు వస్తున్నాయి.
ENG vs NZ: క్రికెట్కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్ టీమ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 147 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో 5 లక్షలకు పైగా రన్స్ చేసిన మొదటి జట్టుగా ఇంగ్లీష్ టీమ్ అవతరించింది.
టీమిండియాలో ఉన్న క్రికెటర్స్ అందరితో పాటు విరాట్ కోహ్లీ కూడా ఫిట్నెస్కి అత్యంత ప్రాధాన్యమిస్తారు. అతడు చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో చూసే ఉంటాం. విరాట్ డైట్ చాలా ప్రత్యేకమని చెబుతుంటారు. ఆ డైట్ కేవలం ఆహారానికే వర్తించదు.. విరాట్ తాగే వాటర్ కూడా చాలా ప్రత్యేకం.
శుక్రవారం జరిగిన అత్యవసర భేటీలో హైబ్రిడ్ మోడల్ లో టోర్నమెంట్ ని నిర్వహించడం తప్ప పాక్కు మరో ప్రత్యామ్నాయం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. అలా కుదరదంటే మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను మరో దేశానికి ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్ధతికి సుముఖంగా ఉంటేనే ఈ రోజు (నవంబర్ 30)పీసీబీతో సమావేశం జరిపి షెడ్యూల్ను ఖరారు చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తుంది.
అడిలైడ్ టెస్టుకు ముందే టీమిండియాకు షాక్ తగిలేలా ఉంది. పింక్ బాల్ మ్యాచ్కు భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ ఆడటం కష్టమే అనిపిస్తుంది. గిల్ బొటనవేలు గాయం నుండి ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో.. నవంబర్ 30 నుండి కాన్బెర్రాలో ప్రారంభమయ్యే ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు.
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో దూసుకుపోయాడు. పెర్త్ టెస్ట్ మ్యాచ్లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసి.. మరోసారి నంబర్-1 టెస్ట్ బౌలర్గా నిలిచాడు.