అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కొక్క స్థానం మెరుగుపరచుకున్నారు. కోహ్లీ మళ్ళీ టాప్-5లోకి చేరాడు. 743 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు. తాజాగా.. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 బంతుల్లో ఏడు ఫోర్లతో అజేయంగా 100 పరుగులు చేశాడు. కోహ్లీకి 52వ వన్డే సెంచరీ.. 82వ అంతర్జాతీయ సెంచరీ.
Read Also: Eluru: శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి.. తమ్మిలేరులో ఇద్దరు గల్లంతు
టాప్-10 బ్యాట్స్‌మెన్‌లలో నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు. యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతనికి 817 పాయింట్లు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ (757) మూడో స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ (679) తొమ్మిదో స్థానంలోనూ ఉన్నారు. పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ (770) రెండవ స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన విల్ యంగ్ (ఎనిమిది స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి), ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర (18 స్థానాలు ఎగబాకి 24వ స్థానానికి), ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ డకెట్ (27 స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి) చేరుకున్నారు.
Read Also: Smartphones: చౌక ధరకే స్మార్ట్ ఫోన్లు.. రూ. 10 వేలలోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!
ఇదిలా ఉంటే.. బౌలర్ల ర్యాంకింగ్‌లో షమీ 14వ స్థానానికి చేరుకున్నాడు. అతనికి 599 పాయింట్లు వచ్చాయి. బంగ్లాదేశ్‌పై షమీ 53 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ కూడా సాధింలేచదు. మరోవైపు.. పాకిస్తాన్‌పై 40 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ 656 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. టాప్-10 బౌలర్లలో కుల్దీప్ ఒక్కడే ఇండియా ప్లేయర్ ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ (689) అగ్రస్థానంలో ఉన్నాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (658) రెండవ స్థానంలో, దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ (641) నాలుగో స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా (రెండు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకున్నాడు). దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు కగిసో రబాడ (నాలుగు స్థానాలు ఎగబాకి 16వ స్థానానికి), న్యూజిలాండ్‌కు చెందిన మైఖేల్ బ్రేస్‌వెల్ (31 స్థానాలు ఎగబాకి 26వ స్థానానికి) చేరుకున్నారు.