ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తదుపరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. కాగా.. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మకు ఈ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని సమాచారం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. టీమిండియా మార్చి 4న సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడం సరైనదిగా భావిస్తోంది. కాగా.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ వ్యవహరించనున్నాడు.
Read Also: MLC Kavitha : రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ గాయపడటంతో.. కొద్దిసేపు గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తరువాత రోహిత్ శర్మ స్టేడియంలోకి వచ్చినప్పటికీ ఫిట్‌గా కనిపించలేదు. మరోవైపు.. రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ఇద్దరు బుధవారం బ్యాటింగ్ ప్రాక్టీస్ సెస్‌షన్‌కు హాజరు కాలేదు. రోహిత్ గాయపడటం, గిల్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. తర్వాత.. గురువారం గిల్ ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. దీనిని చూసి భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Maha Kumbh: మహా కుంభమేళా.. అనేక గిన్నిస్ ప్రపంచ రికార్డులు సొంతం..
కాగా.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తే, రిషబ్ పంత్ జట్టులో చేరే అవకాశం ఉంది. శుభ్‌మాన్ గిల్‌తో కలిసి కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. మరోవైపు.. టీమిండియాలో బ్యాకప్ ఓపెనర్ లేడు. దీంతో యశస్వి జైస్వాల్ జట్టులో స్థానం పొందడం లేదు. అతను ముందుగా జట్టులో స్థానం పొందినప్పటికీ.. చివరి నిమిషంలో అతన్ని ట్రావెలింగ్ రిజర్వ్‌గా చేర్చారు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి టాప్-15లో స్థానం పొందాడు.