BCCI: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, స్టాఫ్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిబంధనలు విధించింది. ఇకపై క్రికెటర్లు తమ భాగస్వాములు, ఫ్యామిలిని వెంట తీసుకెళ్లడం సహా పలు సౌకర్యాల విషయంలో ఆంక్షలు పెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. కానీ, తాజాగా ఈ ‘నో ఫ్యామిలీ రూల్’ నుంచి ప్లేయర్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దుబాయ్‌కి ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను తీసుకెళ్లచ్చని చెప్పిందని టాక్. అందుకు కొన్ని షరతు పెట్టినట్లు తెలుస్తుంది.
Read Also: Online Betting: బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలి.. ప్రాణం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ప్లేయర్స్ వెంట ఫ్యామిలీని అనుమతిస్తామని బీసీసీఐ చెప్పినట్లు టాక్. ఈ విషయాన్ని జాతీయ మీడియాలో కథనాలు ప్రచురించింది. కుటంబాన్ని వెంట తెచ్చుకునే విషయం గురించి ప్లేయర్స్ అందరూ చర్చించుకొని ఆ తర్వాత అభ్యర్థన చేసుకోవాలని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా బోర్డు ఏర్పాట్లు చేయనున్నట్లు సదరు కథనాల్లో పేర్కొన్నాయి.
Read Also: YS Jagan: అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా.. వైఎస్ జగన్ ఫైర్!
అయితే, బీసీసీఐ తీసుకొచ్చిన 10 పాయింట్ల పాలసీ ప్రకారం.. నెల రోజుల పర్యటన ఉంటే.. ఒక వారం ఫ్యామిలీతో ఉండేందుకు అవకాశం ఉంది. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభమై.. మార్చి 9వ తేదీన ముగియనుంది. దీంతో ఈ టోర్నీకి క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు పర్మిషన్ లేదని అప్పుడే బీసీసీఐ చెప్పుకొచ్చింది. దీనిపై ఓ సీనియర్ క్రికెటర్ నుంచి వినతి వచ్చినా.. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేమని బోర్డు తేల్చి చెప్పింది. అయితే, రేపటటి (బుధవారం) నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది. భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఇప్పటికే టీమిండియా అక్కడికి చేరుకుంది. ఈ టోర్నీలో రోహిత్ సేన ఫిబ్రవరి 20వ తేదీన తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడనుండగా.. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోటీ పడబోతుంది.