బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఈ నెల 26 నుంచి ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా బాక్సింగ్ డే టెస్టు ఆడనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి. అయితే.. బాక్సింగ్ డే టెస్టు విషయానికొస్తే.. భారత్ రికార్డు చెప్పుకోదగినంత లేదు.. ఆస్ట్రేలియా రికార్డు అద్భుతంగా ఉంది. గతంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర…
వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న భారత మహిళా జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. వదోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 315 పరుగుల ఛేదనలో విండీస్ 26.2 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. అఫీ ఫ్లెచర్ (24) టాప్ స్కోరర్. భారత బౌలర్ రేణుక సింగ్ (5/29) ఐదు వికెట్స్ పడగొట్టింది. రేణుకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు…
BGT Series: మెల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం…
Virat Kohli Pub: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరులోని ఎమ్జీ రోడ్డులో గల కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్ మహానగర పాలిక ఆఫీసర్లు గుర్తించడంతో నోటీసులు జారీ చేశారు.
బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఉతప్పడైరెక్టర్గా ఉన్నారు. ఇక, ఇందులో పని చేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించలేదని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల అతడిపై పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు.
రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ కూడా రియాక్ట్ అయ్యారు. గత రెండ్రోజుల నుంచి నాకు దిక్కుతోచడం లేదన్నారు. నా ఫేవరెట్ క్రికెటర్ గురించి చెప్పాలా? లేక నా జీవిత భాగస్వామి అనే కోణాన్ని ఎంచుకోవాలా అని తర్జనభర్జన పడుతున్నానని ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు పెట్టింది.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బుధవారం ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే మీడియా ముందుకు వచ్చి అశ్విన్.. తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులు ఉన్నా.. యాష్ అనుహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడానికి ఆ ఇద్దరే కారణమని చెప్పొచ్చు. సిరీస్ మధ్యలోనే…
Ravichandran Ashwin Retirement: భారత క్రికెట్ దిగ్గజం, ప్రపంచ స్థాయి టాప్ స్పిన్నర్స్ లో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2011లో తన టెస్టు క్రికెట్ ప్రవేశంతో మొదలు అశ్విన్ భారత్ కు అనేక విజయాలు సాధించి, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ చేసిన ప్రయాణం ఎన్నో గొప్ప విజయాలతో నిండింది. టెస్టులలో అతను భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడమే కాక.. వన్డే,…
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో నాలుగో రోజు కొనసాగుతుంది. మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆరంభం మరోసారి నిరాశపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రోజు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ చక్కటి…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు మాదిరిగానే మూడో రోజు కూడా వర్షం ప్రభావం చూపింది. కాగా.. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. అందుకు బదులుగా బరిలోకి దిగిన టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరిచింది.