IND vs AUS: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 4న జరగనుంది. ఐసీసీ టోర్నమెంట్ లలో ఇరు జట్లకు సెమీఫైనల్‌లో మూడోసారి తాడోపేడో తేల్చుకోనున్నారు. క్రితం రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ సెమీఫైనల్‌లో ఇరు జట్లు ఎప్పుడు తలపడ్డాయి? అందులో ఎవరు గెలిచారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూనే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి సెమీఫైనల్‌లో గెలుపు ఎవరిది అనేది చూద్దాం.
Read Also: IOB Recruitment 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 750 జాబ్స్.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ టోర్నమెంట్ సెమీఫైనల్‌లో మొదటి ఢీ 2007లో జరిగింది. ఇది T20 వరల్డ్ కప్ మొదటి ఎడిషన్‌లో డర్బన్ వేదికగా జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. భారత ఆటగాడు యువరాజ్ సింగ్ 30 బంతుల్లో 70 పరుగులు చేసి ఆ మ్యాచ్ లో హీరో అయ్యాడు. ఆ తర్వాత 2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. సిడ్నీలో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 328 పరుగులు చేయగా, భారత్ కేవలం 233 పరుగులకే కుప్పకూలింది. దింతో భారత్ భారీ ఓటమిని ఎదురుకొని టోర్నీ నుండి విశ్రమించింది.
ఇప్పుడు మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ లో తలపడనున్నారు. ఈసారి మ్యాచ్ యూఏఈలోని దుబాయ్ వేదికగా జరగనుంది. భారత్ తన గత అన్ని మ్యాచ్‌లను ఇక్కడ గెలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో దుబాయ్‌లో ఆడలేదు. కానీ, ఆ జట్టు కూడా అజేయంగా సెమిస్ కు చేరుకుంది. అంటే ఈసారి పోరు బాగానే ఉండనుంది. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో మొత్తం 8 సార్లు భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌ల చొప్పున గెలిచాయి. అంటే, ప్రస్తుతం ఈ జట్ల మధ్య రికార్డ్ సమంగా ఉంది.
Read Also: TG Govt: ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు..
ప్రస్తుత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు మంచి ఫామ్‌లో ఉండడంతో అభిమానులు భారత జట్టు విజయంపై పెద్ద ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి, సెమీఫైనల్‌లో ఎవరు గెలుస్తారు? టీమిండియా తన విజయ పరంపరను కొనసాగిస్తుందా లేదా కంగారూలు చేతిలో కంగు తింటారో? అన్ని ప్రశ్నలకు సమాధానాలు మార్చి 4 వరకు వేచి చూడాల్సిందే.