ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు ఇదొక మంచి ఎనర్జీ.. ఇంగ్లండ్తో తాజాగా జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుని మంచి జోరు మీదుంది. ఈ సిరీస్‌లోని ఒక మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడం జట్టుకు శుభపరిణామం. ఎందుకంటే రోహిత్ ఫాంలోకి వస్తే.. భారత్‌కు విజయావకాశాలు ఎక్కువ. విరాట్ కోహ్లీ కూడా చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నెం.1గా నిలిచింది. ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా 119 రేటింగ్‌లో మొదటి స్థానంలో ఉంది.
Read Also: Jatadhara : సుధీర్ బాబు ‘జటాధర’ మొదలైంది!
మరోవైపు.. ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించిన న్యూజిలాండ్ జట్టు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మంచి ఫలితాన్ని సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ విజయం న్యూజిలాండ్ జట్టుకు మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. పాకిస్తాన్ పై విజయంతో న్యూజిలాండ్ వారి వన్డే ర్యాంకింగ్స్‌లో 100 నుండి 105కి పెరిగింది. దీంతో.. న్యూజిలాండ్ జట్టు నాల్గవ స్థానానికి చేరుకుంది. ఫైనల్లో ఓడిపోయిన పాకిస్తాన్ 107 రేటింగ్‌తో మూడవ స్థానానికి పడిపోయింది. అటు.. శ్రీలంకపై ఆస్ట్రేలియా 0-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో.. 110 రేటింగ్‌తో ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో ఉంది.
Read Also: CM Chandrababu: అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం..
కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ నాటికి ఈ జట్ల ఐసీసీ ర్యాంకింగ్స్‌పై ప్రభావం పడవచ్చు. టోర్నమెంట్ ఫైనల్ మార్చి 9న జరుగుతుంది.