టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసి.. మరోసారి నంబర్-1 టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
ప్రతిష్టాక టోర్నీ ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. మొదటి టెస్టు ముందు.. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుండగా.. తాజాగా శుభ్‌మన్ గిల్ కు కూడా గాయపడ్డాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించాడు. కాగా.. ఈ సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. నాల్గవ మ్యాచ్‌లో అజేయంగా 109 పరుగులు చేశాడు. దీంతో.. టీ20 ఫార్మాట్లో 2024లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందున్న విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు టీమిండియా విజయంతో మెరిశారు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ బీసీసీఐ నుంచి సెలవును అభ్యర్థించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది
IND vs SA: నేడు టీ20 సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత్ ఈరోజు (శుక్రవారం) దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించినా.. బ్యాటింగ్‌లో టీమిండియా తడబడుతోంది.
Champions Trophy 2025: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడంపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) తన జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో మొత్తం టోర్నమెంట్ దేశం వెలుపల నిర్వహించబడుతుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ఏ టోర్నీలోనూ పాకిస్థాన్‌ను భారత్‌తో ఆడేందుకు అనుమతించేది లేదని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్…
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టు రెండు బృందాలుగా ఆస్ట్రేలియా చేరుకుంది. బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొనే దిశగా రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలెట్టింది. మంగళవారం టీమిండియా ప్లేయర్స్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. తొలి శిక్షణ శిబిరంలో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ తదితరలు బ్యాటింగ్ సాధన చేశారు. హిట్టర్లు పంత్, జైస్వాల్ భారీ షాట్లు ఆడారు. జైస్వాల్ కొట్టిన ఓ బంతి స్టేడియం పక్కనే ఉన్న రహదారిపై పడింది.…
భారత టీ20 జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో నేడు మూడో టీ20లో తలపడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో ఆరంభించిన భారత్.. రెండో మ్యాచ్‌లో తడబడింది. దాంతో మూడో టీ20 కీలకంగా మారింది. ఈ టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని సూర్య సేన చూస్తోంది. బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సంజూ శాంసన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయగా.. రెండో…
IND vs AUS: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. చీలమండకు గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం మధ్యప్రదేశ్‌తో జరిగే తమ తదుపరి రౌండ్ రంజీ మ్యాచ్‌లో షమీ బెంగాల్ తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.…