రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలిపై టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంతో ఎదిగాడని అన్నారు. రోహిత్ తన సహచరులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం టీమిండియాకు మంచి విషయం అని శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డారు. “రోహిత్ అందరితో కలుపుకుపోయే కెప్టెన్. ఆయన ఒత్తిడిలో ఎలా పనులు చేయాలో, ఆటగాళ్లను ఎలా ఏకతాటిపైకి తీసుకురావాలో అతనికి తెలుసు. కెప్టెన్‌గా ఆయన చాలా ఎదిగాడు. ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు నెగ్గాలో ఆయనకి చాలా బాగా తెలుసు.” అని ధావన్ అన్నారు.
Read Also: Nandamuri Balakrishna: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
శిఖర్ ధావన్ 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ధోనీ నిర్ణయంతో రోహిత్ శర్మను తన ఓపెనింగ్ భాగస్వామిగా తీసుకున్నారని అన్నారు. “ఆ మ్యాచ్‌కు హాఫ్ డే ముందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాకు గుర్తుంది. ఆ సమయంలో నేను కొత్త, నేను కూడా బాగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ధోనీ, రోహిత్‌తో నన్ను ఓపెనింగ్ చేయమని చెప్పారు,” అని ధావన్ చెప్పారు. మొదటి మ్యాచ్‌లోనే చాలా మంచి ఆరంభం లభించింది. మేము వికెట్ కోల్పోకుండా 100 పరుగులు సాధించాము. వికెట్ ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుండటం వల్లే 10వ ఓవర్ వరకు మేము 30-35 పరుగులు మాత్రమే చేసామని ధావన్ చెప్పాడు. కానీ మా జోడీ ఇంత బలంగా మారుతుందని.. తాము 10 సంవత్సరాలు కలిసి జట్టుకు ఆడుతామని తాను ఎప్పుడూ ఊహించలేదని ధావన్ తెలిపారు.
Read Also: DK Shivakumar: శశిథరూర్, తాజాగా డీకే శివకుమార్.. కాంగ్రెస్‌లో కలకలం..
రోహిత్, తన మధ్య స్నేహం గురించి ధావన్ మాట్లాడుతూ, “మా స్నేహం జూనియర్ క్రికెట్ రోజుల్లో మొదలైంది. మేము ఒకరినొకరు విశ్వసిస్తూ.. మైదానంలో, మైదానం బయట కూడా మా బంధం చాలా బలంగా ఉండేది. మేము కలిసి ఆడాము, చాలా సిరీస్‌లు గెలిచిన తర్వాత కలిసి పార్టీలు చేసుకున్నాము. మేము ఒక జట్టుగా ఆడాము.” అని ధావన్ చెప్పుకొచ్చారు.