IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో నాలుగో రోజు కొనసాగుతుంది. మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆరంభం మరోసారి నిరాశపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రోజు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ చక్కటి…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు మాదిరిగానే మూడో రోజు కూడా వర్షం ప్రభావం చూపింది. కాగా.. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. అందుకు బదులుగా బరిలోకి దిగిన టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరిచింది.
బ్రిస్బేన్‌లో పరుగుల వరద పారిస్తాడనుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపరిచాడు. జోస్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో.. కోహ్లీని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33), కెప్టెన్ రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టగా.. జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్…
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2-24-25లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ 405/7 స్కోరుతో మూడో రోజైన సోమవారం ఆట ప్రారంభించిన ఆసీస్.. మరో 40 పరుగులు జోడించి మూడు వికెట్స్ కోపోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (70) హాఫ్ సెంచరీ చేశాడు. రెండోరోజు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101)లు సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో…
మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు కాసేపు ఆపేశారు. వర్షం కారణంగా దాదాపు గంట ఆట తుడిచిపెట్టుకుపోయింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో గెలిచిన భారత్.. అడిలైడ్ టెస్టులో ఓడిపోయింది. ఇక బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో మరలా ఆధిక్యం సంపాదించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్ మెరుగుపడితేనే భారత్ ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో…
Mohammed Shami Double Century: ప్రస్తుతం దేశంలో దేశీయ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ టి20గా జరుగుతోంది. ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ బరోడా, బెంగాల్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇకపోతే, టీమిండియా స్టార్ బౌలర్…
Rishabh Pant Got Injured: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా.. టీమిండియా మొదటి టెస్టులో విజయం సాధించగా.. ఆ తర్వాత రెండో టెస్ట్ అడిలైడ్ లో 10 వికెట్ల తేడాతో ఓటమిని చూసింది. ఇక టీమిండియా ప్రస్తుతం బ్రిస్బేన్ టెస్టుకు సన్నద్ధమవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు టీమిండియా ఆటగాళ్లంతా సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే, ఈ క్రమంలో రిషబ్…
డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు స్టార్ట్ కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ కు సంబంధించిన టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ స్టేడియం కెపాసిటీ లక్ష మందికి పైగా ఉండగా.. మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉండగా.. ఇప్పుడే మొదటిరోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.