ఆటకు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటున్నా అని, ఎప్పుడు అవకాశం లభించినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అని టీమిండియా సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా తెలిపాడు. సెలెక్షన్ తన చేతుల్లో లేదని, ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించట్లేదన్నాడు. కచ్చితంగా క్రికెట్ ఆడటాన్ని కొనసాగిస్తా అని, భారత జట్టుకు మళ్లీ ఆడే అవకాశం లభిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని పుజారా పేర్కొన్నాడు. ‘నయా వాల్’గా పేరు తెచ్చుకున్న పుజారా.. ఫామ్ లేమితో భారత జట్టులో స్థానం…
WTC 2025-27: సౌతాఫ్రికా 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) టైటిల్ గెలిచిన వెంటనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025-27 సైకిల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొమ్మిది జట్లు కలిసి మొత్తం 71 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. 2025 జూన్ 17న శ్రీలంకలోని గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఇక ఈసారి ఎక్కువ మ్యాచ్‌లు ఆడే జట్లలో ఆస్ట్రేలియా (22 టెస్టులు), ఇంగ్లాండ్ (21 టెస్టులు)…
టెంబా బవుమా సారధ్యంలోని దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ICC ట్రోఫీని సాధించింది. WTC ఫైనల్ 2025లో, దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి మొదటిసారి టైటిల్‌ను గెలుచుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతకుముందు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్టు గత రెండు WTC సైకిల్స్‌ను గెలుచుకున్నాయి. WTC ఫైనల్ 2025 గెలిచిన తర్వాత, దక్షిణాఫ్రికాకు దాదాపు రూ. 30 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు కూడా…
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఫైనల్స్ ఏ కలిసి రావడం లేదు. ఐపీఎల్ ఫైనల్ లో ఆర్సీబీతో జరిగిన టైటిల్ మ్యాచ్ లో అయ్యర్ సారధ్యం వహించిన పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. పదిరోజుల తర్వాత అయ్యర్ సారధ్యం వహించిన సోబో ముంబయి ఫాల్కన్స్ జట్టు ఫైనల్లో సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ పది రోజుల వ్యవధిలో అయ్యర్ రెండు సార్లు ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ ఫైనల్…
ఈ రోజు (జూన్ 10న) ఉదయం పంత్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఓ భారీ సిక్సర్ కొట్టాడు.. అది నేరుగా వెళ్లి స్టేడియం పైకప్పుకి తగలడంతో బద్దలైపోయింది. ఇక, పంత్ కొట్టిన ఈ భారీ సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.
Rinku Singh Engagement: భారత క్రికెటర్ రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను రింకూ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దని నిశ్చితార్థం ఈరోజు (జూన్ 8న) జరగనుంది.
తాను ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కెప్టెన్‌గా ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ సవాల్‌తో కూడుకున్నదని, ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఓ బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి గిల్ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ…
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినిచ్చే అవకాశముంది. పనిభార నిర్వహణలో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బుమ్రా అన్ని మ్యాచ్‌లూ ఆడే అవకాశం లేదని జట్టు ఎంపిక సందర్భంలోనే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. బుమ్రా లేకున్నా భారత జట్టుపై ప్రభావం పడదని, అతడి గైర్హాజరీలోనూ రాణించే పేస్ విభాగం…
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఓటముల నేపథ్యంలో ఇద్దరు వీడ్కోలు పలికారు. ఈ రెండు సిరీస్‌ల అనంతరం ఆటగాళ్ల స్థాయిలోనే కాకుండా కోచింగ్ బృందంలో కూడా చాలా మార్పులు జరిగాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌లను గత నెలలో వారి…
Pakistan: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ బౌలర్ సదియా ఇక్బాల్ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. సదియా, ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. గత వారం ర్యాంకింగ్స్‌లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆమె ఓ స్థానం మెరుగుపర్చుకుంది.