పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దాయాది పాకిస్థాన్‌తో ఆసియా కప్ 2025లో భారత్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ఇండియన్ ఫాన్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే ఐసీసీ, ఏసీసీ నిబంధనల ప్రకారం పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడక తప్పలేదు. మ్యాచ్ విజయంను పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మ్యాచ్ సాయంలో, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పాక్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకుండా ఉండడంపై ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో మ్యాచ్‌ను ఆడాల్సి వచ్చినా.. ఇలా టీమిండియా నిరసన వ్యక్తం చేసింది.
Also Read: Asia Cup 2025: పాకిస్థాన్‌తో మ్యాచ్.. టీమిండియాపై అక్తర్ ఫిర్యాదు!
పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటమే మన క్రికెటర్లకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని టీమిండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సురేష్ రైనా చెప్పాడు. ‘ఓ విషయంను మీకు చెప్పాలనుకుంటున్నా. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో మన ఆటగాళ్లను చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. పాక్‌తో ఆడటం ఇష్టమేనా అని వ్యక్తిగతంగా అడిగితే చెబుతారు. ఈ ప్రశ్నకు అందరూ లేదనే బదులిస్తారు. బీసీసీఐ వల్లే మన ప్లేయర్స్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించారు. పాకిస్థాన్‌తో మనోళ్లు ఆడటం నన్ను చాలా బాధించింది. పాక్‌పై విజయం సాధించడం సంతోషమే కానీ.. మ్యాచ్ ఆడకుండా ఉంటే ఇంకా బాగుండేది’ అని రైనా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.