Discount on Gold: యుద్ధం ఎఫెక్ట్.. భారీ డిస్కౌంట్‌పై బంగారం అమ్ముతున్న వ్యాపారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Discount on Gold: ఇరాన్-ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.. అయితే, ఇది ప్రపంచ బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల్లో దిగుమతి-ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ పరిస్థితుల ప్రభావం బంగారం వ్యాపారంపై కూడా పడింది. ప్రస్తుతం అనేక బంగారు షిప్‌మెంట్‌లు దుబాయ్‌లో నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. United Arab Emirates వైమానిక ప్రాంతం కొంతకాలం మూసివేయబడటం వల్ల బంగారం రవాణా ఆలస్యం అవుతోంది. దీంతో అనేక ఎగుమతిదారులు తమ బంగారం సరుకులను సమయానికి పంపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రవాణాలో జాప్యం కారణంగా నిల్వ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన స్టాక్‌ను త్వరగా క్లియర్ చేయడానికి దుబాయ్ వ్యాపారులు బంగారాన్ని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. సమాచారం ప్రకారం, లండన్ బెంచ్‌మార్క్ ధర కంటే ఔన్సుకు సుమారు 30 డాలర్లు తక్కువగా బంగారం అమ్ముతున్నారు. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం 10 గ్రాములకు దాదాపు రూ.900 వరకు తగ్గింపుగా భావించవచ్చు. కాగా, ప్రపంచ బంగారం వ్యాపారంలో దుబాయ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆసియా దేశాలకు బంగారం సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఇది నిలిచింది. ముఖ్యంగా Switzerland, United Kingdom మరియు కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం ఇక్కడి నుంచి మళ్లీ ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఇరాన్‌కు సంబంధించిన భద్రతా పరిస్థితులు మరియు గగనతల పరిమితులు ఈ రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.
Also Read
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ఇక, భారత్ విషయానికి వస్తే, దుబాయ్ నుంచి బంగారం దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలలో భారత్ ఒకటి. అయితే ప్రస్తుతం దేశంలో తగినంత నిల్వలు ఉన్నందున తక్షణ ప్రభావం కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఈ పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగితే దిగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, దేశీయ మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.62 లక్షల వద్ద ఉండగా, ఒక కిలో వెండి ధర రూ.2.68 లక్షలకుపైగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు 20 శాతం వరకు పెరిగాయి. అయితే డాలర్ బలపడటం మరియు యుద్ధ పరిస్థితుల వల్ల మార్కెట్‌లో కొంత అస్థిరత కొనసాగుతోంది.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..