ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నాడు. తాను టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానని, ఇంగ్లండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని తాజాగా బీసీసీఐకి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు దూరమైన నేపథ్యంలో విరాట్ కూడా తప్పుకొంటే ఇంగ్లండ్ పర్యటనలో అనుభవ లేమి భారత జట్టును దెబ్బ తీస్తుందని బీసీసీఐ భావిస్తోంది.…
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇంగ్లాడ్ పర్యటనకి ముందు హిట్‌మ్యాన్ టెస్టుల నుంచి వైదొలగడంతో ఇప్పుడు బీసీసీఐ రెండు విషయాపై దృష్టి సారించింది. ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టెస్ట్ సారధిని ఎంపిక చేసే పనిలో ఉంది. ఇప్పటికే టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ పేరు వినిపిస్తోంది.…
రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దాంతో త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. యువ ఆటగాడికే టెస్ట్ సారథ్యం అప్పగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య…
Virat Kohli: విరాట్ కోహ్లీ.. పేరుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచానికి. అంతర్జాతీయ వేదికలపై వేలకొద్ది పరుగులు, ఎప్పుడు మైదానంలో అగ్రెసివ్ గా కనిపించే ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ గత ఏడాది టీమిండియా అంతర్జాతీయ టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి విధితమే. కోహ్లీ ఈ నిర్ణయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే ఆల్ రౌండర్ రవీంద్ర జెడేజాలు కూడా…
భారత జట్టులో చోటే తన లక్ష్యం అని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అభిషేక్ పోరెల్ చెప్పాడు. ప్రస్తుతానికి ఢిల్లీ తరఫున ఆడుతూ పెద్ద స్కోర్లు చేయడంపైనే దృష్టి పెట్టా అని, భవిష్యత్తు లక్ష్యం మాత్రం టీమిండియాకు ఆడడమే అని తెలిపాడు. డీసీ కోచ్‌లు, కెప్టెన్ తనకు మద్దతుగా నిలుస్తున్నారని.. వారి సలహాలు, సూచనలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 225 రన్స్…
ఆగస్టులో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో, రెండు జట్ల మధ్య 3 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 3 ODI మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. వన్డే సిరీస్ ఆగస్టు 17 నుంచి ప్రారంభమవుతుంది. టీ20 సిరీస్ ఆగస్టు 26 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటన కోసం భారత జట్టు ఆగస్టు 13న ఢాకా చేరుకుంటుంది. Also Read:Vizag Steel Plant Workers Indefinite strike: విశాఖ స్టీల్…
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు హిట్‌మ్యాన్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) పరిశీలిస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఎంసీఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు చేసిన సేవలకు గాను రోహిత్‌ను ప్రత్యేక గౌరవంతో గుర్తించాలని ఎంసీఎ భావిస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్, వాక్‌వేలకు మాజీ అధ్యక్షులు…
ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అడపాదడపా మెరుపులు తప్పితే.. నిలకడగా రాణించలేదు. ఇటీవలి కాలంలో టీమిండియా తరఫున కూడా పెద్దగా రాణించిన దాఖలు లేవు. దాంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్‌ను బెంగళూరు వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టుకు ఎంపిక కాని ఈ హైదరాబాద్ పేసర్.. ఐపీఎల్ 2025లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఉప్పల్ మైదానంలో…
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మహీ.. కీపర్, బ్యాటర్‌గా సేవలందిస్తున్నాడు. తన సహచర ప్లేయర్స్ సురేష్ రైనా, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి వారు ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. 43 ఏళ్ల ధోనీ ఇంకా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధోనీ.. తనకు ఎదురైన…
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టులో చోటు లభించకపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని.. కానీ జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నానని సిరాజ్ తెలిపాడు.