ఆసియా కప్ 2025లో భారత్ తన తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం యూఏఈ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రాక్టీస్ సెషన్‌లో సిక్సర్ల మోత మోగించాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన భారత్ ట్రైనింగ్ సెషన్‌లో అభిషేక్ గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి.. 25-30 సిక్సర్లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read: Rinku Singh: రాత్రికి రాత్రే సెలబ్రిటీని అయ్యా.. కెరీర్, లవ్, ఫాన్స్ అన్నీ సెట్!
ప్రాక్టీస్ సెషన్‌లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజు శాంసన్ కూడా పాల్గొన్నారు. వీరందరూ అభిషేక్ శర్మ మాదిరి విధ్వంసకర బ్యాటింగ్ చేయలేదు. అభిషేక్ ఎదుర్కొన్న ప్రతి బంతిని మైదానం బయటకు పంపాడు. నెట్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శిక్షణా సెషన్‌లో అభిషేక్ హైలైట్‌గా నిలిచాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్‌తో అతడు ఎంత మంచి ఫామ్‌లో ఉన్నాడో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ప్రాక్టీస్ సెషన్‌లో మాదిరి యూఏఈపై కూడా విరుచుకుపడనున్నాడు. అభిషేక్ ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచే బాదుడు మొదలుపెడుతాడన్న విషయం తెలిసిందే. అభిషేక్ రెచ్చిపోతే భారత్ సునాయాస విజయం సాధిస్తుంది.