టీమిండియా మాజీప్లేయర్, లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా మొదటి టెస్టులో మన బ్యాటర్లు సెంచరీలు చేసిన విధానంపై అసహనం వ్యక్తం చేశాడు. మొదటి టెస్టులో మనవాళ్లు 5 సెంచరీలు చేశారు. కానీ డాడీ హుండ్రేడ్స్ ఎక్కడా.. అని ప్రశ్నించాడు. అవి చేయలేదు కాబట్టే మ్యాచ్ ఓడిపోయారు. అంతే కాదు కొంతమంది బ్యాటర్లు డిఫెన్సివ్ మోడ్ లో బ్యాటింగ్ చేశారు అని ఆరోపించాడు.
ప్రస్తుతం మూడు భారత జట్లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి. సీనియర్ పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడుతుండగా.. మహిళల జట్టు టీ20 సిరీస్‌ను ఆడుతోంది. మరోవైపు ఆయుష్ మాత్రే అండర్-19 జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే పర్యటిస్తోంది. ఇంగ్లీష్ యువ జట్టుతో ఆయుష్ మాత్రే టీమ్ మ్యాచ్‌లు ఆడుతోంది. మొత్తంగా భారత క్రికెటర్స్ అందరూ ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. ఇక జులైలో భారత క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. భారత పురుషుల…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ట్రోఫీ గెలవడంతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకపాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అద్భుత బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో భాగంగా తన టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను వరుణ్ ఎంచుకున్నాడు. అయితే అతడి జట్టులో టీమిండియా…
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో సహా ఐదుగురు బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్స్ తీయలేకపోయాడు. సిరాజ్, ప్రసిద్, జడేజాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండవ టెస్ట్ కోసం మణికట్టు స్పిన్నర్…
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌కు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఏవేవో ఆలోచనలతో తన కాళ్లు, చేతులు ఆడలేదని.. ఆ రోజు రాత్రి నిద్రపోలేదని చెప్పాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ కచ్చితంగా సిక్స్ పోతుందనుకున్నా అని, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడని ప్రశంసించాడు. కీలక సమయంలో రిషబ్ పంత్‌కు గాయం అయిందని కంగారు పడ్డా అని, అయితే బ్యాటర్ల లయను…
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది. సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైన టీమిండియా తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. దీని కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లో, బ్యాట్స్‌మెన్ వారి టెక్నిక్‌ను, బౌలర్లు వారి లైన్-లెంగ్త్‌ను మెరుగుపరచుకోవడంలో బిజీగా…
లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగు కీలక క్యాచ్‌లను డ్రాప్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి టీమిండియా ఆటగాళ్లు 8 క్యాచ్‌లు డ్రాప్ చేస్తే.. అందులో నాలుగు జైస్వాల్ నేలపాలు చేశాడు. లైఫ్స్ అందుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు అదనంగా 250 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో యశస్వి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ…
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ప్రశంసలు కురిపించాడు. రాహుల్ తన వ్యక్తిగత జీవితం కన్నా.. క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని కొనియాడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో ఓ సీనియర్ బ్యాటర్‌గా రాహుల్ తన పాత్ర పోషించాడన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కంటే ముందు తాను సన్నాహక మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నానని రాహుల్ తనతో చెప్పాడని బదానీ తెలిపారు. రాహుల్ లీడ్స్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 42, రెండో…
లీడ్స్ ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. మరోసారి భారత బౌలింగ్ బలహీనత బయటపడింది. తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్ తీసినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. మొహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు పరుగులు ఇవ్వడం భారత్ ఓటమికి కారణమైంది. టీమిండియా బౌలర్ల వైఫల్యంతో 370కి పైగా టార్గెట్‌ను ఛేదించింది. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్ యూనిట్‌పై సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసహనం వ్యక్తం…
లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ అనూహ్యంగా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది. జూలై 2న బర్మింగ్‌హామ్‌లో ఆరంభం అయ్యే రెండో టెస్టులో కఠిన సవాలును టీమిండియా ఎదుర్కోబోతోంది. రెండో టెస్టులో గెలవడం గిల్ సేనకు ఎంతో కీలకం. ఈ కీలక టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది. కొన్నేళ్లుగా జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో…