ఆసియా కప్ 2025లో తన చివరి గ్రూప్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. పసికూన ఒమన్‌ను సూర్య సేన ఢీకొట్టనుంది. ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్ 4 పోరు నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌లా ఉపయోగించుకోనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. యూఏఈ, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట భారత్ పసికూన ఒమన్‌పై గెలవడం ఖాయం. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చే అవకాశముంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నాడు. అబుధాబి పిచ్ స్పిన్నర్లకు పెద్దగా సహరించకపోవచ్చు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో ఒకరికే తుది జట్టులో ఛాన్స్ దక్కొచ్చు. అర్ష్‌దీప్‌తో పాటు హర్షిత్ రాణా ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశముంది. బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.
Also Read: CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం రేవంత్.. రాష్ట్రంలో పెట్టుబడులే టార్గెట్!
తుది జట్లు (అంచనా):
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి.
ఒమన్: జతిందర్, కలీమ్, హమద్, వసీమ్, ఆర్యన్, వినాయక్, జితేన్, ఫైసల్, షకీల్, హొస్సేన్ షా, సమయ్.