MK Stalin: డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. అవయవ దానం చేసిన దాతలకు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.
Chicken Shawarma: ఇటీవల కాలంలో పిల్లలు స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నారు. కొన్ని సందర్బాల్లో ఇవి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్, డయేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. పిల్లల ఆనందం కోసం తల్లిదండ్రులు కూడా వీటిని కొనిచ్చేందుకు వెనకాడటం లేదు. అయితే పిల్లల ఆరోగ్యాన్ని, ప్రాణాల్ని పణంగా పెడుతున్నామని పేరెంట్స్ కి అర్థం కావడం లేదు.
శతాబ్దాలు గడుస్తున్నా కావేరి జలాల వివాదం మాత్రం ముగియడంలేదు. ఈ కావేరి జలాల పైన తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు పుదుచ్చేరికి హక్కు ఉంది. ఈ జలాల మీద వివాదాలు దశాబ్దాల కాలం కొనసాగాయి.
Tamil Nadu: తమిళనాడులో తొలిసారిగా ముగ్గురు మహిళలు ఆలయ పూజారులుగా మారారు. కులాల అడ్డుగోడలను ఛేదించి దేవుడి గర్భగుడిలోకి ప్రవేశించి లింగసమానత్వాన్ని తీసుకురానున్నారు. దేవుడి సేవ చేసుకునే భాగ్యం కొన్ని కులాలకే కాదు అందరికి ఉందనే నిజాన్ని చాటి చెప్పేందుకు ఈ ముగ్గురు మహిళలు సిద్దమయ్యారు. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే యువతులు తమిళం, సంస్కృతం చదువుతూ శ్రీరంగం ఆలయంలో ఒక ఏడాది కోర్సును పూర్తి చేశారు. Read Also: Sabarimala: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు జారీ…
ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం నుంచి తమిళనాడు, హైదరాబాద్ లో 22 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపింది. ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల కోసం విస్తృత తనఖీలు చేసింది.. రెండు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో దాడులు చేయగా.. ఎన్ఐఏ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Madras High Court: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించాయి. ఇదిలా ఉంటే సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సనాతన ధర్మం అనేది దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వతమైన కర్తవ్యాల సమాహారమని అలాంటి విధులను ఎందుకు నాశనం చేయాలని ఆలోచించారు’’ అంటూ వ్యాఖ్యానించింది.
NIA Raids Latest: 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా' (ఐఎస్ఐఎస్) రాడికలైజేషన్, క్రూట్మెంట్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) తమిళనాడు, తెలంగాణలోని 30 ప్రదేశాలపై దాడులు చేసింది.
BR Ambedkar: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్పై విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్ గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆర్బీవీఎస్ మణియన్ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మణియన్ గతంలో తమిళనాడు వీహెచ్పీ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటుబాంబు పేలి మృతి చెందిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. పండు అనుకుని ఆ ఏనుగు నాటుబాంబును కొరికింది. ఏనుగు కొరికిన వెంటనే ఆ బాంబు నోటిలోనే పేలింది.