NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి వ్యతిరేకంగా తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్ పరీక్షను గత కొంత కాలంగా తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించాలని డీఎంకే లక్ష్యంగా పెట్టుకుంది.
నీట్ పరీక్షను బీజేపీ రాజకీయం చేసిందని ఆరోపిస్తూ.. గత కొన్ని నెలలుగా నీట్ పరీక్ష నిర్వహణకు వ్యతిరేకంగా స్టాలిన్ నిరసనలు తెలుపుతున్నారు. నీట్ సామాజిక విరుద్ధమని, ఇది పట్టణ విద్యార్థులకు, కోచింగ్ సెంటర్లలో చదువుకునే అవకాశం ఉన్న విద్యార్థులకు మాత్రమే అనుకూలంగా ఉందని డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. నీట్ పరీక్ష కారణంగా తమిళనాడు వ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. గతంలో డీఎంకే పార్టీ నీట్ పరీక్షను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు నిరాహార దీక్ష చేసింది.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
Read Also: Israeli–Palestinian conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఇరాన్ ఎంటరైతే..!
పరీక్షకు వ్యతిరేకంగా డీఎంకే ఈ సిగ్నేచర్ క్యాంపెన్ ప్రారంభించింది. ఈ సంతకాల పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు. రాష్ట్ర మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీట్ నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) వరకు ఫాసిస్టులు మా విద్యాహక్కును హరించడానికి ప్రయత్నిస్తున్నారు, మేము వారిపై నిరంతరం పోరాడుతాము, నీట్ నిషేధించాలన్న మా డిమాండును వ్యతిరేకిస్తే జల్లికట్టు తరహాలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని కేంద్ర ప్రభుత్వానికి ఉదయనిధి హెచ్చరికలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి కూడా ఈ ఉద్యంలో పాల్గొనాలని ఆయన కోరారు. తమిళనాడు హక్కుల్ని కాపాడుకునేందుకు బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చామని చెబుతున్న ఏఐడీఎంకే పార్టీ కూడా ఈ ప్రచారంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..